నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డిని మైకులముందు వదిలేశారు చంద్రబాబు! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనా, ఆయన సతీమణి వైఎస్ భారతిపైనా అవాకులూ చెవాకులూ పేళడానికి లైసెన్స్ ఇచ్చి వదిలేసినట్లున్నారు. దీంతో.. పార్టీ అధినేతను పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నాను, చంద్రబాబు ఫ్యామిలీని రోడ్డుకి ఈడుస్తున్నాను, ఎల్లో మీడియ అధినేతల భార్యలను సైతం రోడ్లపైకి లాగుతున్నాను అనే సృహ కోల్పోతున్నారు ఆనం వెంకటరమణా రెడ్డి!
వయసు పెరిగినంత మాత్రాన్న బుద్ది పెరగాలని లేదు.. బుర్ర పెరిగినంత మాత్రాన్న సంస్కారం ఉండాలని లేదు. ఈ విషయంలో ఆనం కి ఆనమే సాటి! ఈ క్రమంలో తాజాగా మైకందుకున్న ఈ సీనియర్ టీడీపీ నేత… వైఎస్ జగన్ పైనా, భారతి పైనా పనికిమాలిన ఆరోపణలు చేశారు. సాక్షి పత్రికలో ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలపై తన అక్కసు వెళ్లగక్కిన ఆయన… ఆరోపణల అనంతర పరిణామాలను మరిచిపోయారు.
ఇందులో భాగంగా… వైఎస్ జగన్ ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన… మీరు సీఎం అయ్యాక రూ.500 కోట్ల ప్రకటనలు సాక్షికి ఎందుకు ఇచ్చారు? మీ భార్య ముఖంలో చిరునవ్వు చూడడానికా? అలుగుతారని భయపడి ఇచ్చారా? అని ప్రశ్నించారు. దీంతో సంచలన కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ సమయంలో కొడాలి రంగంలోకి దిగితే బాబు ఫ్యామిలీతోపాటు.. ఈసారి ఎల్లో మీడియాధిపతుల భార్యలు కూడా తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
తనదైన నోటి డ్యాష్ తో వైఎస్ భారతిపై కామెంట్స్ చేశానని ఆనం సంబరపడిపోవచ్చు కానీ… పరోక్షంగా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి లను తెరపైకి తెస్తున్నారని.. పరోక్షంగా ఆన్ లైన్ లో అల్లరిపాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా… ఆనం చెబుతున్నట్లు పత్రికా అధిపతి అయిన భారతి కల్లల్లో ఆనందం కోసమో, ఆమె అలుగుతారనో జగన్ ప్రకటనలు ఇచ్చి ఉంటే…. గతంలో చంద్రబాబు ఎవరి భార్యల కళ్లల్లో ఆనందం చూడడానికి, ఎవరి సతీమణులు అలుగుతారని ఎల్లో పత్రికలకు కోట్లాది రూపాయల ప్రకటనలు ఇచ్చారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని అంటున్నారు నెటిజన్లు.
ఇదే ప్రశ్న కొడాలి నాని నోటి నుంచి వస్తే దానికి మరింత మసాలా తోడవుతుందని… అదే జరిగితే చంద్రబాబు తో పాటు ఎల్లో పత్రికాధిపతులు సైతం ఈసారి వెక్కి వెక్కి ఏడ్చే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని కామెంట్లు పెడుతున్నారు. ఆనం లాంటి నేతలను అలా వదిలేస్తే… టీడీపీకి ప్రయోజనం సంగతి దేవుడెరుగు… అంతకు రెట్టింపు నష్టం జరుగుతుందనే విషయం చంద్రబాబు & కో గ్రహించాలని సూచిస్తున్నారు. మరి ఈ విషయాలను చంద్రబాబు & కో గమనిస్తారా… ఆనంని మందలించి అదుపులో పెడతారా… లేక, మహిళలకు తామిచ్చే గౌరవం ఇంతే అని పరోక్షంగా చెబుతారా… ఫలితంగా వారి ఇళ్లల్లో ఆడవారిని రోడ్లపైకి తెస్తారా అన్నది వేచి చూడాలి!