కరుణానిధిని పరామర్శించిన రాహుల్

తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న  డీఎంకే చీఫ్ కరుణానిధిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఈ రోజు పరామర్శించారు.

మంగళవారం  మధ్యాహ్నం 4 గంటలకు చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి ఆయన చేరుకున్నారు.  కరుణానిధిని కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘కరుణానిధితో మాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడే ఆయనను కలుసుకున్నాను. ఆయన బాగానే ఉన్నారు,’ అని చెపారు.

‘తమిళనాడులాగానే కరుణానిధి కూడా చాలా గట్టి మనిషి. తమిళనాడు స్ఫూర్తి ఆయనలో బలంగా ఉంది…’’ అని రాహుల్ వాఖ్యానించారు.