నవ్వితే నవరత్నాలు.. నటకిరీటి నవ్విస్తే నవ్యరత్నాలు..!
సినిమాల్లో నవ్వులు కమేడియన్ల డ్యూటీ.. ఆ డ్యూటీని లూటీ చేసి హాస్యానికి హీరో హోదా తెచ్చిన రాజేంద్రుడు.. నవ్వులు పండించడంలో గజేంద్రుడు..!
రేలంగి లాంటి కోణంగి.. పొట్టిప్లీడరు టైపు చెట్టుకింద ప్లీడరు.. రాజబాబు వంటి నవ్వులరేడు.. ఆ తరంలోని ఈ త్రయం నవ్వులన్నీ మూటకట్టి జంధ్యాల..నరసింహారావు.. ఈవివి…బాపు.. ఆ దిగ్గజాలతో జతకట్టి బకెట్ల కొద్ది నవ్వుల టికెట్లు చింపేసిన కామెడీ హీరో.. నవ్వుల బ్యూరో…!
అన్నట్టు..ఈ రాజేంద్రుడు నవ్విస్తూ ఆగలేదండోయ్.. ఆ నలుగురు ఆంటూ వైవిధ్యాన్నీ ఒప్పించాడు ఈ నవ్వుల గురు.. మీ శ్రేయోభిలాషిగా కొందరి మరణాన్ని ఆపే పాత్రకు ప్రాణం పోశాడు..!
ఎన్ని సినిమాలు చేసినా అలసిపోలేదు ఈ నవ్వులరేడు.. నవ్విస్తూనే ఉన్నాడు నాడు.. నేడు శవంతో కలిసి కూర్చుని భోంచేస్తూ.. ఈ డబ్బున్నోళ్ళంతా తెలివైనోళ్ళు అనుకుంటాం.. అదృష్టవంతులు రా.. అని స్టేట్మెంట్లిస్తూ.. మద్దిమద్దిలో ఊరు ఖాళీ అయిపోతుందని బాధపడుతూ.. సాగిస్తున్నాడు సినీమాల జైత్రయాత్ర.. ఈ నవ్వుల మాత్ర..!
ఎక్కడ ఉందో కాని మచ్చ… ఈ జమజచ్చ.. నాలుగున్నర దశాబ్దాలుగా అలా చెలరేగుతూ చేసేస్తున్నాడు నవ్వుల రచ్చరచ్చ.. ఆ విషయంలో యధేచ్చ! 😁😁😁😁😁😁😁
నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలతో