టీడీపీ అనుకూల మీడియాగా పేరొందిన పత్రిక, ఛానల్‌ను నడుపుతోన్న సంస్థ అది. ఆ సంస్థ అధినేతని కిరోసిన్ కిట్టు అనీ, బూతు కిట్టు అని కొందరు పిలుస్తుంటారు. టీడీపీ – బీజేపీ కలిసి వున్నప్పుడు ఆ రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టి, టీడీపీని నాశనం చేసింది ఈ మీడియా సంస్థే. ఆ మాటకొస్తే, టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో పతనమైపోవడానికి బీజం వేసింది కూడా ‘కిట్టు’గారేనంటారు చాలామంది తెలుగు తమ్మళ్ళు. కానీ, చంద్రబాబుకి ఆ ‘కిట్టు’ అంటే వల్లమాలిన అభిమానం. ఎందుకంటే, చంద్రబాబు పెంచిన ‘వృక్షం’ సదరు మీడియా సంస్థ. ఇక, అసలు విషయానికొస్తే, ‘అబ్ ఆయేగా మజా’ అంటున్నాడు కిట్టు.
బీజేపీకి చెందిన ఓ ఎంపీ, ‘కిట్టుగారి మీడియా సంస్థ’ మీద పరువు నష్టం దావా.. అనేసరికి, ‘అబ్ ఆయేగా మజా.. మేం తిరిగి మీ మీద దావా వేస్తాం..’ అని ఎదురుదాడికి దిగారు ‘కిట్టు’. అంతే కాదు, ఇకపై తమ మీడియా సంస్థల మీద ఎవరు విమర్శలు చేసినా ఊరుకోరట.. అందరికీ నోటీసులు ఇచ్చుకుంటూ వెళతారట, అందుకోసం లీగల్ టీమ్ కూడా సన్నద్ధంగా వుందట. ఇదెక్కడి చోద్యం.? ప్రభుత్వం మీద అడ్డగోలు కథనాలు మీడియా రాయొచ్చు.. అలాంటి మీడియాలో ఓ సంస్థ మీద ఇంకెవరూ విమర్శలు చేయకూడదు. దీన్నే పచ్చకామెర్ల వ్యవహారంగా రాజకీయాల్లో చెబుతుంటారు.
మీడియా సంస్థ అధిపతిగా కాకుండా తనను తాను ఓ పొలిటికల్ కింగ్ మేకర్ అనే స్థాయిలో కిట్టుగాడి ఫీలింగే ఇన్ని అనర్థాలకి కారణం. అసలంటూ కిట్టుగాడ్ని దూరం పెడితే తప్ప తాము బాగుపడే ప్రసక్తే లేదని తెలుగు తమ్ముళ్ళే వాపోతున్న వేళ, కిట్టు ఇంకా తన గురించి తాను ఎక్కువ ఊహించుకోవడం హాస్యాస్పదం కాక ఇంకేముంటి.? దావా వేస్తే సరిపోతుందా.. ఎవరైనా.? కోర్టులున్నాయి, అక్కడ తేలతాయి నిజానిజాలేంటో. దావా వేసేస్తామని ఎవరు బెదిరించినా.. అది కిట్టూ బెదిరింపు అయినా, అంతకన్నా కామెడీ ఇంకేమీ వుండదు.