కడప జిల్లా కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతి

రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మను బదలీ చేసిన ఎన్నికల కమిషన్, కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ దేవ్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

2012 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అభిషేక్ మహంతికి గతంలో కడప జిల్లాలో పని చేసిన అనుభవముంది. గత సంవత్సరం నవంబర్ 2న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఫిబ్రవరి 14 వరకూ పనిచేశారు. ఆ తర్వాత గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా బదిలీ అయ్యారు. ఇప్పుడు తిరిగి ఆయన్నే ఎస్పీగా నియమించారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.