విడుదలకు ముందు పాక్ లో అభినంద్ మాట్లాడిన మాటలివే (వీడియో)

దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభినందన్ శుక్రవారం రాత్రి 9.21 నిమిషాలకు భారత గడ్డ పై కాలు మోపారు. అనంతరం తాను పాక్ ఆర్మీకి ఎలా చిక్కాను,  ఆ తర్వాత ఏం జరిగింది చెప్పారు. అభినంద్ మాట్లాడిన వీడియోలో ఏమన్నారంటే…

“నేను పాక్ లో పడిపోయిన సమయంలో నా దగ్గర కేవలం ఒక గన్ మాత్రమే ఉంది. అప్పటికే కొంత మంది ప్రజలు నేను పారాచూట్ ద్వారా దిగటం చూసి అక్కడికి వచ్చారు. వారు నన్ను కొట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పాక్ జవాన్లు, వారి కెప్టెన్ నన్ను సేఫ్ చేశారు. వారి క్యాంపుకు తీసుకెళ్లి నాకు ప్రథమ చికిత్స చేశారు. వారిలో శాంతి కనిపిస్తుంది. పాక్ ఆర్మీ నన్ను గౌరవంగా చూసుకుంది.” అని అభినంద్ అన్నారు. అభినంద్ విడుదలకు ముందు ఈ మాటలు పాక్ లో చెప్పారు.

abhinandh india enter after first talking