Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదు… ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు!

Perni Nani:; మాజీ వైకాపా నాయకుడు పేర్ని నాని మెడకు ఉచ్చు బిగుస్తోంది ఈయన గోదాములో బియ్యం మిస్ అవ్వడంతో ఈయనపై కేసు నమోదు అయ్యాయి అంతేకాకుండా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నటువంటి వాదనలు కూడా తెరపైకి రావడంతో విచారణ చేపట్టిన అధికారులు తనపై కేసు నమోదు చేశారు. దీనితో ఏ క్షణమైన ఈయన అరెస్టు కావచ్చు అనే వాదన వినపడుతుంది.

రేషన్ బియ్యం కుంభకోణ విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదు చేశారు.పోలీసులు ఏ-6 (A-6)గా నమోదు చేశారు. కృష్ణా జిల్లా, బందరు తాలుక పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రిపై కేసు నమోదు అయింది. ఈ విధంగా పేర్ని నాని పై కేసు నమోదు కావడంతో తనని ఏ క్షణమైన పోలీసులు అరెస్టు చేయవచ్చని భావించిన నాని ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

ఈ విధంగా ఈయనపై కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.కేసు విచారణలో భాగంగా సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే గోడౌన్ మేనేజర్ మానస తేజాను అరెస్టు చేశారు. తాజాగా రైస్ మిల్లర్, లారీ డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇక వీరందరినీ పోలీసులు విచారణ చేసి ప్రధాన నిందితులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అక్రమ రేషన్ బియ్యం కేసులో భాగంగా పేర్ని నాని మెడకు రోజురోజుకు ఉచ్చు బిగుస్తోందని తెలుస్తుంది. ఏ క్షణమైనా ఈయన కూడా కటకటాల వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది.