ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లలో తప్పు ఒప్పుకున్న జగన్!?

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లలో తప్పు ఒప్పుకున్న జగన్!?

కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలుపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఇదో పెద్ద స్కామ్ అంటూ.. విమర్శలు.. ప్రతి విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా దీనికి సాక్ష్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో ఇప్పుడు ఏకంగా జగనే వాటిపై క్లారిటీ ఇచ్చేసినట్లున్నారు.

దక్షిణకొరియా నుంచి ఏపీకి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అవి వచ్చిన వెంటనే.. ముఖ్యమంత్రి జగన్ వాటిని ఓపెన్ చేసి టెస్ట్ కూడా చేయించుకున్నారు. అయితే ఆ వెంటనే.. చత్తీస్ గఢ్ మంత్రి చేసిన ఓ ట్వీట్ పెద్ద దుమారానికి కారణం అయ్యింది. ఆ ట్వీట్‌లో మంత్రి.. ఒక్కో టెస్టింగ్ కిట్ ధర రూ.337 రూపాయల చొప్పున 75వేల కిట్లు కొనుగోలు చేశామని ప్రకటించారు.

సేమ్ అవే కిట్స్‌ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1200 పెట్టి కొని బారీ స్కామ్‌కు పాల్పడిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం ఒక్కో టెస్ట్ కిట్ రూ. ఏడు వందలకు అటూ ఇటూగా కొనుగోలు చేశామని చెప్పింది. అలా చూసినా కూడా.. డబుల్ రేట్‌కి కొనుగోలు చేసినట్లే కదా..? దీంతో కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది.

ఇర దీన్ని కవర్ చేసేందుకు స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. అతి తక్కువ ధరకు కిట్లను కొనుగోలు చేసిన వైద్య ఆరోగ్య శాఖకు అభినందనలు అన్నారు. ఈ మాట ఎందుకు అన్నారంటే.. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు ఒప్పంద పత్రంలో ఏ రాష్ట్రాానికి అయినా తక్కువ ధరకు ఇస్తే అదే ధరకు తమకు ఇవ్వాలని ఉందట. ఆ మేరకు వైద్య ఆరోగ్య శాఖ చేసింది మంచిదే అని సమర్థించుకున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలతో మాట్లాడి అదే రేటు చెల్లిస్తామని చెప్పారు. అయినా ఒక పొరపాటు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనే తొందర కన్నా కవర్ చేయాలని ప్రయత్నిస్తేనే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. ముందుగానే అసలు విషయాన్ని వెరిపై చేసుకుని ప్రకటన చేసి ఉంటే బాగుండేది.. కానీ ఇలా ఒకసారి ఒకలా.. మరోసారి మరోలా ప్రకటనలు చేస్తే పుకార్లు, ప్రజలకు ఉన్న అనుమానాలు కాస్త రెట్టింపు అవుతాయి తప్ప.. తీరిపోవు.