జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిట్టిన తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టు శేఖర్ చౌదరి రిమాండ్ కు తరలించారు. వరద సహాయక చర్యల విషయంలో చంద్రబాబునాయుడు, లోకేష్ బృందం చేసిన బురద రాజకీయాలు అందరూ చూసిందే. పునరావాస చర్యలు తీసుకోవటం లేదని, బాధితులకు సహాయం చేయటంలో ప్రభుత్వం విఫలమైందంటూ నానా రకాలుగా చంద్రబాబు అండ్ కో శాపనార్ధాలు పెట్టిన విషయం అందరూ చూసిందే.
దీనికి పరాకాష్టగా ఓ రైతు జగన్ తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను నోటికొచ్చినట్లు తిట్టారు. విధానపరంగా విమర్శించినా, ఆరోపణలు చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ సదరు రైతు జగన్, అనీల్ ను వ్యక్తిగతంగా తిట్టటమే కాకుండా అనీల్ ను కులంపేరు పెట్టి ఘాటుగా దూషించారు. మామూలుగా బాధితులు ఎవరు కూడా ఈ స్ధాయిలో నోటికొచ్చినట్లు తిట్టరు.
అలాంటిది ఈ రైతు మాత్రం ఎందుకంత ఓవర్ యాక్షన్ చేశారు ? ఎందుకంటే ఆయన అసలైన రైతు కాదు. టిడిపి పెయిగ్ ఆర్టిస్ట్ కాబట్టే. నారా లోకేష్ బృందం శేఖర్ చౌదరికి రైతు వేషం వేయించి బురద రాజకీయం చేసింది. ఎప్పుడైతే రైతు రూపంలో చౌదరి మాట్లాడారో వెంటనే అసలు విషయం బయటపడిపోయింది.
దాంతో చౌదరిపై డిజిపి సవాంగ్ కు నేరుగా ఫిర్యాదులు అందటం పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేయటం అన్నీ జరిగిపోయాయి. కేసును కోర్టులో ప్రవేశపెట్టగా సెప్టెంబర్ 7వ తేదీ వరకూ రిమాండ్ కు విధించారు. మొత్తానికి లోకేష్ పైత్యానికి ఓ పెయిడ్ ఆర్టిస్ట్ రిమాండ్ కు వెళ్ళాల్సొచ్చింది. ఇంకా చాలామందున్నారట పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళంతా ఏమవుతారో చూడాల్సిందే.