రంగారెడ్డి టిఆర్‌ఎస్‌లో అవిశ్వాసాల లొల్లి

తెలంగాణలో మున్సిపల్, మండల పరిషత్ లలో అవిశ్వాసాల చిచ్చు రగులుతూనే ఉంది. మున్సిపల్ , మండల పరిషత్ లు ఏర్పడి నాలుగు సంవత్పరాలు పూర్తి కావడంతో అసంతృప్తులంతా అవిశ్వాస రాగమెత్తారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టిల్లో, మండల పరిషత్ లలో అవిశ్వాస సమస్య అధికార టిఆర్ ఎస్ పార్టీకి పెను సవాల్ గా మారింది.

రంగారెడ్డి జిల్లాలోనూ అవిశ్వాస సమస్య ప్రారంభమైంది. పెద్దేముల్ ఎంపీపీ వాణిశ్రీ పై పొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మాణం పెట్టి పదవి నుంచి తొలగాంచారు. ఆమె స్థానంలో వైస్ ఎంపీపీగా ఉన్న నర్సమ్మకు బాధ్యతలు అప్పగించారు.

బడంగ్ పేట మున్పిపల్ చైర్మన్ నర్సింహ్మపై కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మాన నోటీసును జేసీ కి అందజేశారు. నర్సింహ్మగౌడ్ కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ ఎస్ లో చేరి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. ఈ మున్సిపాలిటిలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా ఇందులో ఆయనకు వ్యతిరేకంగా 13మంది అవిశ్వాస నోటిసుపై సంతకాలు చేశారు. అయితే మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజక వర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో నియోజక వర్గ పరిధిలో చేజారిన బడంగ్ పెట మున్పిపాల్టిని తిరిగి దక్కించుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు నేతలను క్యాంపులకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ చేజారిన మున్సిపల్ ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

తాండూర్ మండల పరిషత్ లోను అవిశ్వాస సెగలు మొదలయ్యాయి. తాండూరు అధికార టిఆర్ ఎస్ ఎంపీపీ కోస్గీ లక్ష్మమ్మపై టిఆర్ ఎస్ అసంతృప్త నేతలు అవిశ్వాస నోటిసును ఆర్డీవో వేణుకు అందజేశారు. వీరికి ఆరుగురు కాంగ్రెఃస్ పార్టీ సభ్యులు మద్దతు ఇవ్వటం గమనార్హం. లక్ష్మమ్మ అభివృద్ది పనులు చేపట్టడంలో విఫలమయ్యారని అందుకే మండలం వెనుకబడి ఉందని ఆ కారణంతోనే అవిశ్వాస తీర్మానం ఇచ్చామని నేతలు అంటున్నారు.

ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ భరత్ కుమార్ ను గద్దె దించేందుకు అధికార పార్టీ నేతలే పావులు కదుపుతున్నారు. కొంతమంది కౌన్సిలర్లు ఇప్పటికే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ ను కలిశారు. కానీ ఆయన అలా చేస్తే పార్టీకి తనకు చెడ్డపేరు వస్తుందని వారికి నచ్చచెప్పి పంపినట్టు తెలుస్తుంది. మెజార్టీ సభ్యులు అవిశ్వాసం పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు.

వికారాబాద్ మున్పిపాలిటి చైర్మన్ సత్యనారాయణ కాంగ్రెస్ సురేష్ టిఆర్ ఎస్ లపై అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్లు పావులు కదుపుతున్నరు. పెద్దఅంబర్ పేట లో కూడా అవిశ్వాసం పై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల సొంత పార్టీ నేతలే అవిశ్వాసానికి సిద్దమవుతుంటే పలుచోట్ల అవిశ్వాసాలు పెట్టక తప్పదేమో అన్న పరిస్థితి ఏర్పడింది. ఈ అవిశ్వాస చిచ్చుతో టిఆర్ ఎస్ నేతలు, కేసీఆర్ అంతర్మథనంలో పడ్డారు. మరీ అవిశ్వాసాల చిచ్చు ఎప్పుడు చల్లారుతుందో చూడాలి.