బెజ‌వాడ‌లో రివ‌ర్స్ అయిన బొండా సీన్‌…?

బతికి చెడటం అనే సామెత… విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సక్రమంగా వర్తిస్తుంది. రాజకీయంగా ఒకప్పుడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో చక్రం తిప్పింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయవాడ తూర్పు, సెంట్రల్… అలాగే విజయవాడని ఆనుకుని ఉన్న పెనమలూరు… గన్నవరం.. మైలవరం నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీకి మంచి పట్టు౦ది. అయితే ఈ నియోజకవర్గాల్లో ఈసారి రెండు స్థానాలు మాత్రమె తెలుగుదేశం విజయం సాధించింది. ఇది పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.

అన్ని పక్కన పెట్టి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వస్తే… ఇక్కడ తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఎక్కువ. కమ్యునిస్ట్ పార్టీ కూడా ఇక్కడ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చింది. 2014 ఎన్నిక‌ల్లో బొండా ఏకంగా 27 వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఐదేళ్ల‌లో బొండాపై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక గ‌త‌ యేడాది ఎన్నిక‌ల్లో బొండా ఉమా ఓటమి పాలయ్యారు. ఇక అక్కడి నుంచి ఆయనకు ఇబ్బందులు నియోజకవర్గంలో మొదలయ్యాయని అంటున్నారు.

ఈ ఎన్నిక‌ల్లో బొండా కేవ‌లం 25 ఓట్ల‌తోనే ఓడిపోవాల్సి వ‌చ్చింది. తొలుత బొండా… తక్కువ ఓట్లతోనే ఓడిపోయినా సరే… ప్రజల్లో బలం ఉందని భావించారు అంతా… అయితే ఇప్పుడు ఆయనపై క్యాడర్ కి నమ్మకంపోతుంది. బొండా ఎక్కడికి అయినా వెళ్ళినా సరే… స్థానిక నాయకత్వం ఆయనకు అండగా ఉండటం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కార్యకర్తలు కూడా బొండా కు సహకరించడం లేదని అంటున్నారు.

ఆయన పార్టీ మార‌తారు అనే వార్తలు వచ్చాయి. మధ్యలో మల్లాది విష్ణు తో కూడా ఆయన చర్చలు జరిపారు అనే ప్రచారం ఎక్కువగానే జరిగింది. ఇక స్థానిక నాయకత్వం కూడా ఇప్పుడు పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన బొండా ప‌రిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయ్యిందన్న‌దే బెజ‌వాడ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపించే టాక్‌..?