గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ కి దగ్గరవుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడంటూ జరుగుతున్నా ప్రచారం జోరుగానే ఉంది. అయితే బిజెపి తో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం అనే న్యూస్ పై వామపక్ష నేతలు మాత్రం .. పవన్ ని చేగువేరా కాస్త చెంగువీర అయ్యారని విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్ధాంతాలు పక్కన పెట్టి పవన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నాడని వాక్యాలు చేస్తున్నారు. అయితే ఈ విషయం పై జనసేన పార్టీ నేత జెడి లక్ష్మి నారాయణ స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిని రాజధానిగా సాధించడం కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నారని తెలిపారు.
భవిష్యత్ ఎన్నికల్లోను కలిసి పోటీ చేస్తామని జెడి తెలిపారు. ఇంతకాలం పార్టీ నిర్ణయాలపై పెద్దగా స్పందించని జెడి తాజగా ఈ పొత్తు పై మాట్లాడడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంతే కాదు బిజెపి తో పొత్తు పెట్టుకోవడం జనసేన పార్టీకి శుభసూచకంగా అభివర్ణించారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తాము సమర్దిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని అయన వై ఎస్ ఆర్ సిపి కి సూచించారు. మండలి రద్దు విషయంలో ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని, నియమ నిబంధనలను అనుసరించాలని అయన అన్నారు. ఈ మార్పు విషయం పై న్యాయస్థానం తీర్పు ద్వారా తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు జెడి.