టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు బ్యాంకు షాక్ ఇచ్చింది. కరూర్ వైశ్యా బ్యాంకు లో అప్పుకింద తీసుకున్న 124. 39 కోట్లు చెల్లించాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. హైద్రాబాద్ లోని అబిడ్స్ లో ఉన్న కరూర్ వైశ్య బ్యాంకు శాఖలో శ్రీ భరత్ భారీగా ఋణం తీసుకున్నారు. టెక్నో యూనిట్ ఇంఫ్రాటెక్ ప్రై లిమిటెడ్ కంపెనీ పేరిట అయన భారీగా లోన్ తీసుకుంది. ఇందుకోసం హైద్రాబాద్ లోని అబిడ్స్, గాజువాక, భీమిలి లోని భూములను తాకట్టు పెట్టి దాదాపు 124 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. అయితే .. అయన అప్పు కట్టే విషయంలో ఆలస్యం చేసారని, వడ్డీ కూడా కట్టకపోవడంతో బ్యాంకు నోటీసులు జారీ చేసింది.
ఈ ఏడాది జనవరి వరకు కూడా కంపెనీ పేరిట ఉన్న వడ్డీతో కలిపి అసలు కూడా కలిపి చెల్లించాలని బ్యాంకు ఇచ్చిన నోటీసు లో పేర్కొంది. నోటీసులకు శ్రీ భరత్ స్పందించకపోవడంతో ఆయనతో పాటు తండ్రి, రామారావు సహా ఇతర కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తుకు బ్యాంక్ సిద్ధమైనట్టు సమాచారం.