రోజూ నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో నీకబుర్లు చెబుతుంటా. దైవం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం. అలాగే మనుషుల విలువలు, హిందుత్వ విలువలు, నైతిక విలువల గురించి చెబుతుంటాం. మన పురాణాలు, మన నీతులు, మన చరిత్ర, మన విలువల గురించి మన పిల్లలకు ఎంతో గొప్పగా చెపుతుంటాం. మన సంస్కారం, సంప్రదాయాల గురించి కూడా నేర్పుతుంటాం.
ఇక రాజకీయ నాయకులైన ప్రత్యేకంగా చప్పక్కర్లేదు. మత రాజకీయాలు చేసే వాళ్లు చెప్పే విలువలకు అయితే ఒక హద్దే లేదు. అలాంటి గొప్ప దేశమైన మన భారత దేశంలో ఈ మధ్య కాలంలో అమ్మాయిల పై అనునిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయి, నీతులు చెప్పే రాజకీయ నాయకులు కూడా గతంలో ఇలాంటి కొన్ని కేసులు ఉన్నాయి. నేతలు, రేపిస్టులే కాదు.. సామాన్యుల్లోనూ నైతికత ఎంతమాత్రమో అందరికీ తెలిసిందే.
అందుకు ఒక నిదర్శనం పోర్న్ చూడటం. నిస్సందేహంగా పోర్న్ వీక్షణ అనైతికమే. అయినా అనునిత్యం విలువల గురించి మాట్లాడే మనదేశంలో పోర్న్ వీక్షణ ప్రపంచంలోనే టాప్ ఉంటుంది. పోర్న్ వెబ్ సైట్లకు భారతీయులు ప్రధాన ఆధారం. మన వాళ్లు వాళ్ల సంస్కృతి చెడ్డది అని చెప్పే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. ఇండియాలో పోర్న్ వీక్షణ సరిసమానంగా ఉంది! పోర్న్ వల్ల చాలా విపరీతాలు జరుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు.
అందుకే కొన్నేళ్లుగా సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో పోర్న్ కు చెక్ పెట్టే ప్రయత్నాలు అనేకం జరుగుతున్నాయి. అయినా పోర్న్ ఏదో ఒక రూపంలో నెట్టింట తిష్ట వేసే ఉంది. అలా పోర్న్ ను వీక్షించే వారికి ఇప్పుడు సైబర్ క్రైమ్ ఝలక్ ఇస్తోంది. అతిగా పోర్న్ వీక్షించే వాళ్ల జాబితాను, అందులోనూ చిన్న పిల్లల, హింసాత్మక పోర్న్ వీక్షించే వారిని ఐడెంటిఫై చేసే పని మొదలైనట్టుగా తెలుస్తోంది. మీరు ఎంత రహస్యంగా పోర్న్ వీక్షించినా.. పోర్న్ సైట్లకు ఏ ఐపీల నుంచి వ్యూస్ లభిస్తున్నాయో సైబర్ క్రైమ్ పోలీసులు కనిపెట్టగలరు.
ఇప్పటికే తమిళనాట ఒక జాబితా రెడీ అయ్యిందట. దాదాపు మూడు వేల మందిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. చాలా మంది మర్యాదస్తులే పోర్న్ వీక్షకులు. రేపు మీరు పోర్న్ చూస్తున్నారని తేలింది, వచ్చి కౌన్సిలింగ్ కు హాజరవ్వండని పోలీసుల నుంచి ఫోన్ వస్తే..తల ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి పోర్న్ వీక్షించే వాళ్లు బీ కేర్ ఫుల్! అని సైబర్ క్రైమ్ వాళ్ళు ముందుగానే చెబుతున్నారు. ఇక ఇలాంటి విషయాల్లో చాలా కేర్ ఫుల్గా ఉండాలి. మనం వేసే ప్రతి తప్పటి అడుగు వెనుక మన ఫ్యామిలీ ముడిపడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకండి.