అయ్యిందేదే అయిపోయింది.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో చిల్లర రాజకీయాలు పక్కన పెడదాం.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోకి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇక హద్దు దాటితే అంతే సంగతి అని కూడా హెచ్చరించారు.
ప్రస్తుత ఆపత్కాల సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలకు ఓ విన్నపం ఇచ్చారు. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదామని సూచించారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, ఆకలి దప్పులు తీర్చడంపై దృష్టి సారించాలని కోరారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతోన్న కన్నా, విజయ సాయి రెడ్డి మాటల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లున్నారు. ఏదైనా తప్పులు చూపిస్తే.. వారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారన్నారు.
అయిందేదే అయిపోయింది.. ఇక చాలు.. వ్యక్తిగత దూషణలు ఆపేయకపోతే.. ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందన్న అంశాన్ని కూడా పవన్ గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కూడా అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటూ.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తే ఆ పరిస్థితి రాకతప్పదని స్పష్టంగా చెప్పారు. మరి రాజకీయ పార్టీలు పవన్ మాటలు విని రాజకీయాలు ఆపుతాయా ఏంటి?