జగన్‌ని ఇరికించిన విజయసాయిరెడ్డి

జగన్‌ని ఇరికించిన విజయసాయిరెడ్డి

అసలు వైకాపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ముఖ్యమంత్రి జగన్ ‌ని పొగుడుతున్నాడా…? లేక ఆయనే స్వయంగా ర్యాపిడ్ కిట్స్ కొనుగోలు వ్యవహారంలో జగన్ ని‌ ఇరికిస్తున్నారా? అనిపిస్తోంది.. ఆయన చేస్తోన్న ట్వీట్స్ చూస్తుంటే..

అసలు టెస్టింగ్ కిట్స్ పైన ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్స్ ను మొదటి నుండి చూస్తే.. ముందుగా ఏప్రిల్ 14న విజయ సాయి రెడ్డి ట్వీట్ చూస్తే..  ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల కోసం ఇతర రాష్ట్రాల నుండి అభ్యర్థనలు వస్తున్నాయి, బహిరంగ మార్కెట్ కంటే.. సగం ధరకే ఇవ్వడం వల్ల భారీగా ఆర్డర్లు వస్తున్నాయి అన్నారు. పైగా ప్రభుత్వం ఎక్కడా దీన్ని ప్రచారం కోసం వాడుకోవడం లేదని సెలవిచ్చారు. 

మళ్లీ ఆయనే నాలుగు రోజుల తర్వాత.. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష్య ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వచ్చాయి. దేశంలో జగన్ గారిలా చొరవ చూపిన రాష్ట్రం ఇంకేదైనా ఉందా అంటూ అడిగారు. అసలు నాలుగు రోజుల క్రితం ఆయనే ఇతర రాష్ట్రాల నుండి అభ్యర్థనలు వస్తున్నాయన్న ఆయన మాట మార్చి దక్షిణ కొరియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పారు.

చత్తీష్‌ఘడ్ ఆరోగ్య శాఖా మంత్రి గారు ట్వీట్ చేశారు. దక్షిణ కొరియాతో మాట్లాడుకుని రూ.337 కి తెచ్చుకున్నామని చెప్పారు. దానికి ముందు టెస్ట్ కిట్స్‌ కి సంబంధించి షార్ట్ టెండర్ నోటీస్ ఇచ్చారు. అందులో నేరుగా పాల్గొన్న దక్షిణ కొరియా సంస్థ టెండర్‌లో పాల్గొని కిట్స్ అందించేందుకు ముందుకొచ్చింది. 

చత్తీష్‌ఘడ్‌ తెప్పించినవి లోకల్ అని, పైగా రిజల్ట్ కి 30 నిమిషాలు పడుతాయని, తాము దక్షిణ కొరియా నుండి తెప్పించామని వాటితో పది నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చాయని అన్నారు. కానీ ఆ తర్వాత అవన్నీ ఒకటే అని మళ్లీ ఆయనే చెప్పారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తే.. మళ్లీ ఒప్పందంలో ఎవరికైనా తక్కువకు ఇస్తే మనకూ అదే ఇస్తారు అని ఏదో చెప్పబోయి మరేదో చెప్పేశారు. 

ఇవన్నీ చూస్తుంటే.. అవినీతి మాట పక్కన పెడితే.. అసలు దీనిపై విజయ సాయి రెడ్డికి ఏ మాత్రం అవగాహన  లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. కేవలం ప్రతి పక్షాలను రెచ్చగొట్టడానికి ఆయన ఏదో ప్రయత్నం చేసి దాన్ని రచ్చ రచ్చ చేసేసి చివరికి జగన్ క్లారిటీ ఇచ్చేందుకు ముందుకొచ్చేలా చేశారు. 

అసలు ఇన్ని సార్లు ఇన్ని ట్వీట్స్ చేసే బదులు, ఇంత గందరగోళం సృష్టించే ముందు అసలు ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోయేది. కానీ అలా చేయకపోవడం వల్లే.. ప్రతిపక్షాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ విషయం ఇంత పెద్ద చర్చకు దారి తీసింది. లేని పోని అనుమానాలను క్రియేట్ చేసింది. మొత్తంగా జగన్ ను కూడా ఇందులో ఇరికించినట్లు అయ్యింది.