ఛాయ్ బాబు ఛాయ్ మొదటి అవుట్ లేట్ ని M L A మాగంటి గోపీనాథ్ మరియు కార్పొరేటర్ అట్టలురి విజయ్ లక్ష్మి ప్రారంభించారు.
‘ఛాయ్’ అనండి…’టీ’ అనండి… పిలుపులో, పిలిచే విధానంలో తేడా ఉండొచ్చు కానీ మన తెలుగు ప్రజలు, భారతీయులు తేనీరు (టీ)పై చూపించే ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పూ ఉండదు. ఎన్నో ఏళ్లుగా టీ మన జీవితంలో ఓ భాగం అయ్యింది. ఛాయ్ తాగడంతో చాలామందికి తెల్లారుతుంది. స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడానికి ఛాయ్ తోడవుతుంది. కొందరికి తలనొప్పికి ఔషధం అవుతుంది. మన జీవితంలో ఇంతిలా భాగమైన ఛాయ్ నిజంగా ఔషధాలతో తయ్యారయితే…ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే… రెండిటితో పాటు కొత్త రుచులను మనకు అందిస్తే… ఈ ఆలోచనే ‘సాకేత్ హాస్పిటాలిటీ ప్రై.లి.’ సీఈవో వెంకట్ గారికి వచ్చింది. ఎన్నో దేశాలు తిరిగి, ఎన్నో రకాల టీలను పరిశీలించి జర్మన్ టీను హైదరాబాదీలకు అందుబాటులో తెచ్చారు.
‘ఛాయ్ బాబు ఛాయ్’ పేరుతో ఈ రోజు (ఆదివారం) హైదరాబాద్ శ్రినగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ దగ్గర సరికొత్త ఛాయ్ హబ్ ప్రారంభమైంది. జర్మన్ ఛాయ్ రుచులను మన హైదరాబాదీలకు అందుబాటులోకి తెచ్చిందీ ‘ఛాయ్ బాబు ఛాయ్’.
ఈ ఛాయ్ హబ్ ప్రత్యేకత ఏంటంటే…సహజసిద్ధమైన పకృతి ఫలాల (నేచురల్ ఫ్రూట్స్)తో ఛాయ్ తయారు చేస్తారు. అశ్వగంధతో ప్రత్యేకంగా తయారు చేసిన టీ వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని వెంకట్ తెలిపారు. ‘ఛాయ్ బాబు ఛాయ్’లో మొత్తం 55 రకాల టీలు లభిస్తాయి. కాఫీలు 20 రకాలు ఉన్నాయి. గ్రీన్ టీలను పాలతో తయారు చేస్తారు. అవీ 20 రకాలు లభిస్తాయి. 55 రకాల లస్సీ రుచులనూ ఆశ్వాదించవచ్చు.
‘ఛాయ్ బాబు ఛాయ్’లో లభించే జర్మన్ టీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ‘జీఎస్ ఎంటర్ ప్రైజెస్’ కె. సాధక్ కుమార్