కమల్, రజనీ కి చిరంజీవి సలహా ఏంటో తెలుసా ?

తమిళ రాజకీయాల్లోకి యాక్టివ్ అవ్వాలని చూస్తున్న కమలహాసన్, రజనీకాంత్ ల విషయంలో చిరంజీవి శాపనార్ధాలు పెడుతున్నారా ? చూస్తుంటే అలాగే ఉంది ఆయన మాటలు. కమలహాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఫెయిల్ అవుతారని చిరంజీవి శాపనార్ధాలు పెడుతున్నారు.

తాను ఏపి రాజకీయాలను శాసిద్దామని చిరంజీవి అనుకున్నారు. అయితే జనాల అంచనాలను అందుకోవటంలో ఫెయిలయ్యారు. అందులోను చిరంజీవి ఫెయిలయ్యారంటే అనేక కారణాలున్నాయి. మొదటిది ప్రజారాజ్యంపార్టీ కేవలం కాపుల కోసం పెట్టిన పార్టీగా ముద్రపడింది. రెండోది టికెట్లను అమ్ముకున్నారని విపరీతమైన ఆరోపణలు వచ్చేశాయి.

ఎన్నికల్లో పార్టీ అభిమాన సంఘాల ముఖ్యులను కాదని పూర్తిగా కొత్తవాళ్ళకు, డబ్బులున్న వాళ్ళకే టికెట్లు కట్టబెట్టేశారు. సీనియర్ నేతలకు కూడా చివరి నిముషం వరకూ టికెట్లు ఖరారు చేయలేదు. అదే సమయంలో ఒకవైపు అధికారంలో ఉన్న వైఎస్సార్, మరోవైపు చంద్రబాబునాయుడు అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేసుకున్నారు.

ఇలాంటి అనేక కారణాల వల్ల జనాల్లో చిరంజీవి పలుచనైపోయారు. దాంతో ఎన్నికల్లో బోర్లా పడ్డారు.  తన అనుభవమే కమలహాసన్, రజనీకాంత్ కు కూడా ఎదురవుతాయని చిరంజీవి జోస్యం చెప్పటమే విచిత్రంగా ఉంది. సరే పూర్తిస్ధాయిలో కమలహాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందో చెప్పలేమనుకోండి అది వేరే సంగతి.