ఎన్టీఆర్ బయోపిక్ కు “కాపు “సెగ …

మహా నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రూపొందించిన “ఎన్టీఆర్ కథానాయకుడు ” సినిమా రేపే విడుదలవుతుంది . అయితే ఈ సినిమా ఇప్పుడు బాలయ్య కామెంట్ల వాళ్ళ నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి . గతంలో బాలకృష్ణ మెగా కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను నాగబాబు సోషల్ మీడియాలో కడిగేస్తున్నాడు .

ఇది మొదట్లో రెండు కుటుంబాల మధ్య స్పర్ధలుగా అనిపించింది . అయితే క్రమంగా అది అభిమానుల మధ్య వైరాన్ని పెంచింది . తాజాగా ఈ సమస్య రెండు కులాల మధ్య జరుగుతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టుల వల్ల తెలుస్తుంది . “చంద్ర బాబు విజయానికి పవన్ కళ్యాణ్ ఎంత ప్రచారం చేశాడో .. వాడుకొని వదిలేసిన వాడి బయోపిక్ చూడాలా ? మన రంగాను అతి కిరాతకంగా హత్య చేయించిన వాడి బయోపిక్ చూడాలా ? ముద్రగడను రోడ్ మీద కొట్టించిన వాడు నటించిన వాడి సినిమా చూడాలా ? కాపులను బీసీలుగా మారుస్తానని మోసం చేసిన వాడి సినిమా చూడాలా ? మన కష్టార్జితో ఈ సినిమా చూడాలా ?ఇది సినిమా పంచాయితీ కాదు మన ఆత్మ గౌరవం . మన సినిమా వినయ విధేయ రామ సినిమా చూడండి.

సంక్రాంతి బరిలో కాపువాడ్ని గెలిపించండి . అదే జనసేనకు నాంది , మన విజయ సంకేతం ” హైదరాబాద్ లోని చందా నగర్ కాపు సమితి నుంచి ఈ సందేశం కాపులకు వెడుతుంది .  ఈ సందేశం చూసి కమ్మ సంగం వారు కూడా వినయ విధేయ రామ సినిమా చూడవద్దని పిలుపు ఇచ్చినా ఆశ్చర్య పోనవసరంలేదు . చాలా చిన్న సమస్య , వ్యక్తిగత సమస్య ఇప్పుడు కుల సమస్యగా మారటం పట్ల సినిమా వారు ఆందోళన చెందుతున్నారు . సినిమా పెద్దలు దీని ఆపుతారా ? ఆజ్యం పోసి పెంచుతారో ?