ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బలిపశువులు చేస్తుందెవరు ?

తెలంగాణ సిఎం కేసిఆర్ తరచుగా తమ పనితీరు మీద సర్వేలు చేయిస్తూ ఉంటారు. ఆ సర్వేలు ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా జరుగుతుంటాయి. ఎవరి ఫర్ఫార్మెన్స్ బాగుంది? ఎవరి పనితీరు బాగాలేదు అన్నది సర్వేల ఆధారంగానే సిఎం నిర్దారణకు వస్తారు. పనితీరు బాగాలేని వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో.. ఇటీవల కాలంలో సిఎం కేసిఆర్ చేయించిన సర్వే ఒకటి లీక్ అయిందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు తెగ షేర్ అవుతోంది. ఇదే గ్రాఫ్ బాగాలేని ఎమ్మెల్యేల జాబితా అంటూ ఈ పోస్టు వైరల్ అయింది. అందులో  నలుగురు మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ జాబితా నిజమైనదేనా? కాదా అన్నది తేలడంలేదు. నిజానికి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారంటూ.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. సిఎం ఆఫీసు నుంచి సమాచారం అందినట్లు కూడా చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ లిస్టును అధికార పార్టీ నుంచే లీక్ చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదని సిఎం కేసిఆర్ చేయించిన సర్వేలో ఉన్నట్లు లీకులు అందాయి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు గ్యారెంటీ అని కేసిఆర్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇలా లిస్ట్ రిలీజ్ చేసి ఎమ్మెల్యేలను బదనాం చేయాల్సిన అవసరం గులాబీ బాస్ కు ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

మరోవైపు ఈ జాబితాను ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారెవరైనా రూపొందించి ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ సిఎం కేసిఆర్ ను డైరెక్ట్ గా విమర్శించే కంటే ఆయన బృందంలోని సభ్యులను డీ ఫేమ్ చేయడం ద్వారా అంతిమంగా టిఆర్ఎస్ కు ఇరకాటమైన పరిస్థితి తీసుకురావాలన్న స్కెచ్ ఏమైనా ఉందా తెలియడంలేదు. ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలెదుర్కొంటున్న వారందరి పేర్లు సేకరించి లిస్టు రెడీ చేసి సోషల్ మీడియాలోకి వదిలారా అన్న చర్చ కూడా ఉంది. మరి లిస్టులో ఉన్నవారే డేంజర్ జోన్ లో ఉన్నారా? అంటే అలా ఏమీ చెప్పే పరిస్థితి లేదు. వారికంటే చాలా మంది డేంజర్ జోన్ లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. నలుగురు మంత్రుల పేర్లు రిలీజ్ చేశారు. మరి వారికంటే పనితీరు బాగాలేని మంత్రులు కూడా ఉన్నారు.  వారి పరిస్థితేంటి అన్న చర్చ ఉంది. పద్మారావు, పట్నం మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సి.లక్ష్మారెడ్డి  మంత్రులు జాబితాలో ఉన్నారు.

మొత్తానికి నెలలు గడుస్తున్నా ఈ జాబితా నిజమైనదా? కాదా? అన్న అనుమానాలు మాత్రం ఇంకా నివృత్తి కాలేదు. ఇది ఏ రకంగా చూసినా.. సదరు ఎమ్మెల్యేలు, మంత్రుల మీద జరిగిన కుట్ర అని రాజకీయ నిపుణులు అంటున్నారు. సదరు ఎమ్మెల్యేలను అన్ పాపులర్ చేయడం కోసమే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మరి సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న లిస్ట్ కింద ఉంది చూడండి.

 

మంత్రులు

(1) పద్మా రావు

( 2) తలసాని శ్రీనివాస్ యాదవ్

(3) సి లక్ష్మా రెడ్డి

(4) పట్నం మహేందర్ రెడ్డి

 

మహబూబ్ నగర్ (ఉమ్మడి జిల్లా)

అచ్చంపేట.. గువ్వల బాలరాజ్

మక్తల్ .. చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మహబూబ్ నగర్ : శ్రీనివాస్ గౌడ్

నారాయణ్ పేట : రాజేందర్ రెడ్డి

 

ఆదిలాబాద్ ( ఉమ్మడి జిల్లా)

బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య

చెన్నూరు : నల్లాల ఓదెలు

మంచిర్యాల : దివాకర్ రావు

ఖానాపూర్ : రేఖా నాయక్

 

కరీంనగర్

పెద్దపల్లి : మనోహర్ రెడ్డి

రామగుండం : సోమవరపు సత్యనారాయణ

మంథని : పుట్టా మధు

చొప్పదండి : బొడిగే శోభ

మానకొండూరు : రసమయి బాలకిషన్

 

ఖమ్మం :

ఇల్లందు : కోరం కనకయ్య

కొత్తగూడెం : జలగం వెంకట్రావు

అశ్వారావుపేట: తాటి వెంకటేశ్వర్లు

 

మెదక్

నారాయణ్ ఖేడ్  : భూపాల్ రెడ్డి

అందోల్ : బాబు మోహన్

సంగారెడ్డి : చింతా ప్రభాకర్

 

నల్గొండ

మిర్యాలగూడ : భాస్కర్ రావు

దేవరకొండ : రవీంద్ర కుమార్

మునుగోడు : కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఆలేరు : గొంగిడి సునీత

 

నిజామాబాద్

బోధన్ : షకీల్

కామారెడ్డి : గంప గోవర్ధన్

నిజామాబాద్ (అర్భన్) గణేష్ బిగాల

 

రంగా రెడ్డి జిల్లా

మల్కాజ్ గిరి : కనకా రెడ్డి

శేరిలింగంపల్లి: అరికే పూడి గాంధీ

చేవెళ్ల : యాదయ్య

వికారాబాద్ : సంజీవ్ రావు

మేడ్చల్ : సుధీర్ రెడ్డి

మహేశ్వరం : తీగల కృష్ణారెడ్డి

రాజేంద్రనగర్ : ప్రకాష్ గౌడ్

ఇబ్రహీంట్నం : ఎం . కిషన్ రెడ్డి

 

వరంగల్

జనగాం : ముత్తిరెడ్డి యాదిరెడ్డి

భూపాలపల్లి : మధుసూదనా చారి

ములుగు : చందూ లాల్

మహబూబాబాద్ : శంకర్ నాయక్…

? షేర్ చేయండి ప్రజలకు పనికిరాని MLAలను ఓడించండి…