చలో ఆత్మకూరంటూ వేసిన ఎత్తులు పెద్దగా వర్కవుట్ అవ్వకపోయేసరికి చివరకు చంద్రబాబునాయుడు సామాజికవర్గాలను తెరపైకి తెస్తున్నట్లుంది. అందుకనే నాయకుల పేర్లను చెప్పేసమయంలో సదరు నాయకుడి సామాజికవర్గాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
పోలీసులు హౌస్ అరెస్టు చేసిన నేతల్లో చాలామందున్నారు. కానీ బిసి, ఎస్సీ నేతల అరెస్టులను ఖండిస్తున్నట్లు చంద్రబాబు చెప్పటమంటే చవకబారు ఎత్తుగడులకు దిగినట్లే అనిపిస్తోంది. టిడిపిఎల్పి ఉపనేత, బిసి నాయకుడు అచ్చెన్నాయుడు పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారా ? అంటూ మండిపోయారు. ఇక్కడ అచ్చెన్నాయుడు కన్నా బిసి నేత అన్నదే హైలైట్ అవ్వాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. అదే సమయంలో పోలీసుల పట్ల అచ్చెన్న వ్యవహరించిన తీరును మాత్రం చంద్రబాబు ప్రస్తావించటం లేదు.
బిసి నేతలు దువ్వారపు రామారావు, జగదీషులను అవమానిస్తారా ? అంటూ ఊగిపోవటంలో కూడా చంద్రబాబు చవకబారు ఎత్తుగడలే కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి, ఎస్సీ నేత జవహర్ పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారంటూ హూంకరించారు. అంటే ఎస్సీలను జగన్ ప్రభుత్వం అవమానించిందని చెప్పటమే అసలు ఉద్దేశ్యం.
మొత్తానికి ఏ నేత పేరు చెప్పినా చంద్రబాబు ముందుగా వాళ్ళ సామాజికవర్గాలను ప్రస్తావించటమే విచిత్రంగా ఉంది. పోలీసులు అరెస్టులు చేసేముందు సామాజికవర్గాలను చూస్తారా ఎక్కడైనా ? చలో ఆత్మకూరు పిలుపు పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో చివరకు సామాజికవర్గాలను జగన్ ప్రభుత్వంపై ఎగేయటానికి కూడా సిద్ధపడ్డారన్నమాట 40 ఇయర్స్ ఇండస్ట్రీ.