వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా..? టెంక్షన్లో మిగతా ఎమ్మెల్యేలు 

Vizianagaram
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం వైరస్ బారిన పడుతుండటంతో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకు వైరస్ సోకగా తమిళనాడు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే మరణించారు కూడ. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణలో అయితే ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు వైరస్ సొకగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సైతం వైరస్ బారినపడ్డారు. దీంతో బయట తిరిగే ప్రజాప్రతినిధులంతా బిక్కుబిక్కుమంటున్నారు.
 
 
ఏపీలో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరికి కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోట వైసీపీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు విస్తృతంగా వస్తున్నాయి. దీనిపై అధికార పార్టీ నుండి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే ఇటీవలే అమెరికా నుండి రావడంతో లక్షణాలు బయటపడటంతో పరీక్షలు చేసేసరికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీలో కలకలం మొదలైంది.
 
 
ఎందుకంటే గత వారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు, రాజ్యసభ ఎన్నికలకు సదరు ఎమ్మెల్యే హాజరవడమే ఈ కంగారుకు కారణం. పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా లక్షాణాలు ఉన్నాయనే వార్తలు రావడంతో సమావేశాలకు హాజరైన అందరు ప్రజాప్రతినిధులు మరోసారి టెస్టులకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. మరి దీనిపై అధికార పార్టీ స్పందించి నిజంగానే తమ ఎమెల్యేకు పాజిటివ్ వచ్చిందా లేకపోతే వదంతులా అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది.