విజయసాయిపై రూ 100 కోట్లకు దావా

రాజకీయ నేతలపై కోర్టులో పరువునష్టం దావాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై టివి9 మాజీ సీఈవొ రవిప్రకాష్ రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయబోతున్నారు. ఈ విషయాన్ని రవిప్రకాష్ కార్యాలయం మేనేజరే ఓ ప్రకటనలో చెప్పారు లేండి.

ఏబిసిఎల్ సంస్ధలో చట్ట వ్యతిరేకంగా ప్రవేశించిన జూపల్లి రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి ధ్వయం మాజీ సీఈవోపై నీచమైన ఆరోపణలు చేయిస్తోందంటూ మేనేజర్ ప్రకటనలో మండిపోయారు. నెల రోజుల క్రితం పై ఇద్దరు చేసిన ఆరోపణలనే ఇపుడు విజయసాయిరెడ్డి కూడా చేసినట్లు చెప్పారు.

సరే ఆరోపణల సంగతి ఎలాగున్నా జర్నలిస్టు ముసుగులో  రవిప్రకాష్  చేసిన అరాచకాలు తక్కువేమీ కాదని సంస్ధలో పనిచేసిన వాళ్ళే చెబుతున్నారు. ఇష్టంలేని ఉద్యోగులను తీసేయటం, ప్రమోషన్లు నిలిపేయటం, జీతాలు పెంచకపోవటమే కాదు చివరకు బోనస్ లను కూడా సొంత ఖాతాకు మళ్ళించుకుని వందలాది మంది ఉద్యోగులను రవిప్రకాష్ మోసం చేశారంటూ సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులే మండిపోతున్నారు.