కోట్ల రూపాయిలను కాదనుకుని.. రాజకీయాల్లోకి వచ్చానని సగర్వంగా పదేపదే డబ్బా డైలాగ్ లు పలికిన పవర్ లెస్ కళ్యాణ్ .. చివరికీ డబ్బులు కోసం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సరే మనోడు మాట మీద నిలబడదులే అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ, ఏం మాట్లాడుతున్నాడో తెలియకపోతే ఏం అనుకోవాలి. ఆ మాట కొస్తే తనకన్నా గొప్ప రాజకీయ నాయకుడు లేడని ఆలోచననే పవనం బాబు ఫీల్ అవుతుంటారు. తాజాగా రాజకీయాల గురించి కళ్యాణం బాబు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఒక పెద్ద పిడిఎఫ్ వదిలారు. దానిలో కొన్ని విషయాలను సెలవిచ్చారు. ఆ విషయాలు ఏమిటి అనే విషయం పక్కన పెడితే.. రోజూ సోష మీడియాలో పీడీఎఫ్ లు పోస్ట్ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న పవన్.. అదేమంటే రాజకీయాలు మారుస్తా అనడం నిజంగా ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమే.
నిజానికి ఇప్పటికీ కూడా పవన్ లో ఒక క్లారిటీ లేదు, ఒక్క విజన్ లేదు, విషయ అవగాహన అంతకన్నా లేదు, ఇక విషయ పరిజ్ఞానం గురించి అయితే.. మనము ముచ్చటించుకోవటమే వ్యర్థం. ఇవన్నీ పవన్ కు తెలియవా ? ఇన్నేళ్లు అవుతున్నా అర్ధం కాలేదంటే.. పవన్ కు ఊహాలోకంలో మునిగిపోయి వాస్తవికతను అర్ధం చేసుకోలేని వీక్ నెస్ కూడా ఉందనుకోవాలి. అసలు పవన్ రాజకీయాల్లో ఏం చేయాలనుకుంటున్నాడు ? తన ఎజెండా చెప్పంటే… పుస్తకాల్లోని సూక్తులు చదువుతాడు. ఏమిటో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి అర్ధం కాకపోతే ఏం చెయ్యగలం ? మొత్తానికి పవన్ రాజకీయాల్లో ఒక డిజాస్టర్ హీరో. మరి సినిమాల్లో అన్నా ఈ సెకెండ్ ఇన్నింగ్స్ లో హిట్ కొడతాడో లేక అజ్ఞాతవాసిలా మిఫగిలిపోతాడో !