మాజీ మంత్రి, పర్చూరు వైసిపి నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు షాక్ తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. వైసిపి నుండి టిడిపిలోకి వెళ్ళిన రామనాధంబాబు తిరిగి వైసిపిలో రావటమే దగ్గుబాటిలో టెన్షన్ కు కారణమైంది.
రామనాధంబాబు పార్టీలో చేరిన వెంటనే కార్యకర్తలతో సమావేశాలు పెడుతున్నారు. నియోజకవర్గం మొత్తం మీద చకచకా పర్యటనలు చేసేస్తున్నారు. అధికారులతో సమావేశం నిర్వహించటం, కార్యకర్తలను వెంటేసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు తిరుగుతుండటంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఎప్పుడైతే రామనాధంబాబు పార్టీలో యాక్టివ్ అయ్యారో వెంటనే దగ్గుబాటిలో టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో పర్చూరులో పోటి చేసి ఓడిపోయిన తర్వాత దగ్గుబాటి పార్టీకి ఒకరకంగా దూరమైనట్లే కనిపిస్తోంది. ఆయనతో పాటు కొడుకు హితేష్ చెంచురామ్ కూడా పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి.
అంటే నేతలు, కార్యకర్తలతో దగ్గుబాటికి మొదలైన గ్యాప్ ను రామనాధంబాబు ఫిలప్ చేస్తున్నారు. దాంతో తన భవిష్యత్తుపై దగ్గుబాటిలో అయోమయం మొదలైంది. అందుకనే కొడుకుతో కలిసి దగ్గుబాటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటి జరిపారు. దగ్గుబాటి ఎంఎల్సీ పదవిని ఆసిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆశిస్తున్న పదవి దక్కితే సరి. లేకపోతే ఏం చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తం మీద దగ్గుబటి భవిష్యత్తుపై జగన్ ఏం చేస్తారో చూడాల్సిందే.