చంద్రబాబుకు ఫిరాయింపు నేత షాక్

చంద్రబాబునాయుడుకు ఫిరాయింపు నేత పెద్ద షాకే ఇచ్చారు. అధికారం కోసమే వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఈ నేత తాజాగా టిడిపిలో నుండి బిజెపిలోకి దూకబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే మీడియా వర్గాలతో చెప్పారని సమాచారం. దాంతో టిడిపిలో కొద్ది రోజుల్లో భారీ మార్పులుండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి విషయం తెలిసిందే. మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ప్రలోభాలకు గురిచేస్తే వైసిపి నుండి టిడిపిలోకి దూకేశారు. సరే తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో పార్టీతో పాటు ఫిరాయింపు నేత కూడా ఘోరంగానే ఓడిపోయారు.

పార్టీ సంగతిని పక్కనపెట్టేసిన ఈ నేత తొందరలో బిజెపిలో చేరబోతున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే చేసేసుకున్నారట. ఇంత దీనస్ధితి ఎందుకు వచ్చిందంటే పార్టీ భవిష్యత్ తో పాటు చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం లేకే అంటున్నారు.

ఎంతో ఆదిరించి ఫిరాయింలతో లాక్కుని మంత్రిని చేసిన తర్వాత కూడా ఆదినారాయణ రెడ్డి టిడిపిని వదిలేయాలని నిర్ణయించుకోవటం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. ఫిరాయింపు నేతల్లో ఆదిది మొదటి వికెట్ మాత్రమే. తొందరలో చాలామంది ఫిరాయింపు నేతలు పార్టీని వదిలేయటానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మాజీ మంత్రి ఆదికి ప్రత్యర్ధి అయిన రామసుబ్బారెడ్డి కూడా తొందరలోనే చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో ?