కోడెలకు షాకిచ్చిన కోర్టు

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెలకు  కోర్టు షాకిచ్చింది.   కే ట్యాక్స్ విసూళ్ళతో పాటు వివిధ కేసుల్లో అరెస్టు కాకుండా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోడెల శివప్రసాదరావుతో పాటు కొడుకు శివ రామకృష్ణ కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే ముందస్తు బెయిల్ విషయంలో కోర్టు కాస్త ఆచి తూచి స్పందించింది.  

ముందస్తు బెయిల్ కన్నా ముందు క్రింద కోర్టులో లొంగిపోవాలంటూ ఇద్దరినీ ఆదేశించింది. సెప్టెంబర్  6వ తేదీలోగా నర్సరావుపేట ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అదే సందర్భంలో ఇద్దరి దగ్గర నుండి చెరో రూ. 20 వేలకు పూచికత్తు తీసుకుని వాళ్ళకు బెయిల్ ఇవ్వాలని కూడా కోర్టును ఆదేశించింది. నిందితులిద్దరిని విజయవాడలోనే నివసించాలని కూడా స్పష్టం చేసింది.

ప్రతీ సోమ, బుధ, శనివారాల్లో సంబంధించిన పోలీసు స్టేషన్లలో హాజరుకావాలని కూడా చెప్పటమంటే కోడెలకు తీరని అవమానమనే చెప్పాలి. మామూలుగా ఈ విషయం రౌడీషీటర్లకు, లేకపోతే దారుణమైన నేరాలపై అరెస్టయిన వాళ్ళకి ఇటువంటి కండీషన్ బెయిల్ ఇస్తుంటుంది కోర్టు.

దర్యాప్తులో భాగంగా సాక్ష్యులను ఏమాత్రం ప్రభావితం చేసే చర్యలకు దిగవద్దని హెచ్చరించటం గమనార్హం. మొత్తం మీద అరెస్టు నుండి తప్పించుకునేందుకు కోడెల చేసిన ప్రయత్నాలు ఈ విధంగా బుక్కైపోయారు.