కేంద్ర ఉక్కు శాఖా మంత్రి బీరేంద్ర సింగ్ ఫోన్ చేయడంతో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి. కడపజిల్లా లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోరుతూ తొమ్మిది రోజులుగా ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నారు. తొమ్మిది రోజులకు స్పందించిన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ నుంచి తగిన సమాధానం వస్తుందని ఆశించిన సీఎం రమేష్ కు నిరాశే ఎదురయింది.
ముందుగా దీక్ష విరమించాలని మంత్రి కోరిన వెంటనే ఎం పి రమేష్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ.. రెండు రోజుల్లో ఉక్కు పై స్పష్టమైన నిర్ణయం తీసుకోక పొతే.. నా డెడ్ బాడీ ని *మీరు చూడాల్సి వస్తుందని తేల్చి చెప్పేశారు.. కడప ప్రయోజనాల కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కళ్ళలో నీళ్ళు తిరిగేసరికి అక్కడున్న వాళ్ళంతా తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు..