ఎందుకు ఎన్టీఆర్ ఒక్కడే దిక్కు ?

 
ఎన్టీఆర్.. ఈ మూడు అక్షరాలు  అభినయానికి  అభిమానానికి ప్రతీకలా నిలిచిపోయాయి. తెలుగు నెలకు   గౌరవాన్ని విలువను తెచ్చాయి ఆ మూడు అక్షరాలు. అయితే ఆ ఎన్టీఆర్ కి వారసుడిగా జూనియర్ ఎన్టీఆరే అని ఈ మధ్య ఓ వాదన బాగా ఎక్కువైంది. జూనియర్ రాజకీయాల్లోకి రావాలని  ఆ వాదన చేస్తోన్నవారి లెక్కలు  వాళ్లకు ఉండొచ్చు.  కానీ, దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న  టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ఎన్టీఆర్ తన సినీ జీవితాన్ని త్యాగం చేయాలా ?  పోనీ, త్యాగం చేసినా  జగన్ ప్రభంజనంలో  ఎన్టీఆర్ నెట్టుకురాగలడా ?  ఫ్యాన్స్ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో గెలుపు వస్తోందనుకుంటే..  పవన్ కళ్యాణ్  రెండు చోట్ల పోటీ చేసి ఎందుకు భంగపడ్డాడు ?      
 
 
మరి టీడీపీ భవిష్యత్తు మాట ఏమిటి ? కచ్చితంగా లోకేష్ నాయకుడు అయితే పార్టీ బతికదు. అది తెలిసి కూడా బాబు,  లోకేశం పై  ప్రేమను కురింపించి పార్టీని అప్పగించినా..  అపారమైన సొంత ఇమేజ్ ఉన్న  జగన్ – పవన్ లాంటి నాయకుల ముందు లోకేష్ ఎలా కనిపిస్తాడో వేరే చెప్పక్కర్లేదు. పోనీ వారి తరువాత స్థానాన్ని అయినా  లోకేష్ దక్కించుకోగలడా ? అది కూడా అనుమానమే. అందుకే ఇప్పుడు అందరికీ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు.  ‘జగన్’  ముందు నిలబడి పార్టీని బతికించుకునే ఓర్పు నేర్పు ప్రస్తుతం  టీడీపీకి సంబంధించి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉన్నాయి.   
 
పైగా జగన్ కంటే ఎన్టీఆర్ వయసులో చిన్నవాడు. జగన్ కంటే మాట చాతుర్యం ఉన్నవాడు. ఇప్పటికే  రాజకీయ కుట్రలు గుట్టు ఎరిగిన వాడు. అందుకే టీడీపీకి ఎన్టీఆర్ ఒక్కడే దిక్కు. ఏపీలో పార్టీ బలోపేతం కావాలంటే  జూనియర్ ఎన్టీఆర్ ను 2024 లోపే పార్టీలోకి తీసుకురావాలి, ఎన్టీఆర్ కూడా పార్టీ కోసమే అన్ని వదులుకుని పని చేస్తే  ఏ 2029లోనో  లేదంటే ఆ తరువాత ఎన్నికల్లోనో ఉనికి చాటుకోవొచ్చు.  అప్పుడు అదృష్టం కలిసి వస్తే  ఎన్టీఆర్ ని సీఎంగా కూడా చూడొచ్చు అతని ఫ్యాన్స్.  మరి ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడా ? అంటే అనుమానమే.