ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం?

ఆంధ్ర ప్రదేశ్ వైసిపి లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన CAA చిచ్చు పెద్దగా రగులుకొంటోంది. ఇందుకు వ్యతిరేకంగా శాసన సభ లో తీర్మానం చేయక పోతే మైనారెటికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. వీరి వెంబడి ఎంత మంది వుంటారో? .

కడప జిల్లాకు చెంది ఉప ముఖ్యమంత్రిగా వున్న అంజాద్ భాషా శాసన సభలో తీర్మానం చేయకపోతే రాజీనామా చేస్తానని ఇది వరకే ప్రకటించారు. కడపలో జరిగిన ఒక భారీ ర్యాలీ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.ఇదిలా వుండగా ఫిబ్రవరి ఒకటవ తేది గుంటూరులో జరిగిన సింహ గర్జన సభలో ఎమ్మెల్యే ముస్తాపా మాట్లాడుతూ వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈమేరకు తీర్మానం చేయక పోతే తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి రాజకీయ వర్గాల్లో కాక పుట్టించారు.

అయితే ముస్తాపా మరో అంశం చెప్పారు. ముఖ్యమంత్రి తప్పకుండా తీర్మానం చేస్తారన్నారు. కాని ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కేంద్రానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి శాసన సభలో తీర్మానం చేసే అవకాశం ఏమాత్రం లేదు. ఈ అంశంలో తన పార్టీలో వుండే మైనార్టీ ఎమ్మెల్యేలను సంత్రుప్తి పర్చుతారా? లేక కేంద్రంతో విధి లేకుండా సత్సంబంధాలు పెట్టుకుంటారా? ఏది ఏమైనా మార్చి నెలలో తేలి పోనున్నది