రిలీజ్ డేట్: 18 ఆగష్టు 2023
నటినటులు: సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీవిద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు
డైరెక్టర్: అభిషేక్ మహర్షి
నిర్మాతలు: శివప్రసాద్ పన్నీరు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్. అనంత్ శ్రీకర్
సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం
సంతోష్ శోభన్, రాశి సింగ్ జంటగా నటించిన సినిమా ప్రేమ్ కుమార్. ఈ సినిమాతో తొలిసారిగా డైరెక్టర్ గా పరిచయమయ్యాడు అభిషేక్ మహర్షి. ఇక ఇందులో రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీవిద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు శివప్రసాద్ పన్నీరు నిర్మాతగా బాధ్యతలు చేపట్టగా . ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందించాడు.
రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీగా చేసాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కొన్ని లుక్స్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారిని ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ: ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్) కు ఇప్పటికీ ఎన్నో సంబంధాలు వస్తాయి. కానీ అవి ఏవి కుదరవు. అయితే అనుకోకుండా ఒక సంబంధం కుదురుతుంది. దీంతో నేత్ర (రాశి సింగ్) అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ అదే సమయంలో రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి తను నేత్ర ప్రేమించుకున్నాము.. మా పెళ్లి చేయండి అంటూ పెళ్లి ఆపేస్తాడు. ఇక నేత్ర తండ్రి రాజ్ మాదిరాజు వెంటనే కూతురిని ఇచ్చి తనతో పంపించేస్తాడు. ఇక ప్రేమ్ కుమార్ కు మరో పెళ్లి కుదరగా అది కూడా క్యాన్సిల్ అవుతుంది. దీంతో తనకు పెళ్లి అవ్వట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ తో తన ఫ్రెండ్ సుందర్ లింగం (కృష్ణ తేజ) తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతాడు. ప్రేమ, పెళ్లి జంటలను విడగొట్టడమే వీళ్ళ పని. అయితే అదే సమయంలో ప్రేమ్ కుమార్ కు నేత్ర ఎదురు పడుతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన రోషన్ నేత్రను కాకుండా అంగనా (రుచితా సాధినేని) ను ఎందుకు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతాడు.. మరి నేత్ర ఏం చేస్తుంది.. ప్రేమ్ కుమార్ చివరికి ఏం చేస్తాడు అనేది మిగిలిన కథలోనిది.
ప్లస్ పాయింట్స్: సినిమా కథ, మ్యూజిక్, నేపథ్య సంగీతం, నటీనటుల పర్ఫామెన్స్.
మైనస్ పాయింట్స్: కొన్ని ఎమోషనల్ సీన్స్ మరింత కనెక్ట్ అయితే బాగుండేది.
సాంకేతిక విభాగం: తొలిసారి డైరెక్టర్ గా అభిషేక్ మహర్షి కథను తెరపై బాగానే చూపించే ప్రయత్నం చేశాడు. రాంపీ నందిగాం అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అనంత్ శ్రీకర్ అందించిన సంగీతం కూడా బాగుంది. మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
చివరి మాట: ఈ సినిమా ఒక మంచి డ్రామా ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పాలి. కాబట్టి ఒకసారి చూస్తే సరిపోతుంది.
రేటింగ్: 3/5