కిరోసిన్ సినిమాతో తన టాలెంట్ చూపించిన ధృవ వాయు ఇప్పుడు కళింగ అంటూ రచయిత, దర్శకుడు, హీరోగా ఇలా అన్ని యాంగిల్స్‌లో తన సత్తా చాటేందుకు వచ్చాడు. సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతోన్నా కూడా.. సినిమా మీదున్న నమ్మకంతో రెండ్రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమాను ఆడియెన్స్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.
కథ
లింగ (ధృవ వాయు)కి నిత్యం ఓ కల వెంటాడుతూ ఉంటుంది. అడవి.. ఏదో తెలియని శక్తి.. తన తాత మరణం.. ఇలా ఏదో ఒకటి కళలో కనిపిస్తూనే ఉంటుంది. జాలీగా సారా అమ్ముకుంటూ ఉండే లింగ.. చిన్నతనం నుంచే పద్దు (ప్రగ్యా నయన్)ను ఇష్టపడుతాడు. పద్దు సైతం లింగని ఇష్టపడుతుంది. ఇక ఆ ఊరి పెద్ద (ఆడుకాలం నరైన్), అతని సోదరుడు బలి (బలగం సంజయ్) అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి. పద్దు మీద కన్నేసిన బలిని లింగ ఏం చేస్తాడు? అసలు లింగకి వచ్చే ఆ కల ఏంటి? ఆ ఊరి పొలిమేర అవతల ఏ శక్తి ఉంటుంది? అసుర భక్షి కథ ఏంటి? ఆ ఊరి సంస్థానానికి ఉన్న శాపం ఏంటి? వీటన్నంటితో లింగకి ఉన్న కనెక్షన్ ఏంటి? అన్నది కథ.
నటీనటులు
ధృవ వాయు తన పాత్రకు న్యాయం చేశాడు. లింగ కారెక్టర్‌కు కావాల్సిన రఫ్ నెస్, రగ్డ్ నెస్‌ను చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ బాగానే చేశాడు. ఇక హీరోయిన్ ప్రగ్యా పద్దు పాత్రలో తెరపై అందంగా కనిపించింది. విలన్లుగా కనిపించిన ఆడుకాలం నరైన్, బలగం సంజయ్ మరీ అంతగా భయపెట్టలేకపోయారనిపిస్తుంది.లక్ష్మణ్ మీసాలా ఫ్రెండ్ కారెక్టర్‌లో మెప్పిస్తాడు. బలగం ఆర్టిస్టులు ఇందులో బాగానే మెప్పించారు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ తమ పరిధి మేరకు పర్వాలేదనిపిస్తారు.
విశ్లేషణ
కళింగ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగానే ఉంటుంది. పేపర్ మీద కథను రాసుకున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. కానీ అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో టీం కాస్త తడబడినట్టుగా కనిపిస్తుంది. ధృవ వాయు మేకింగ్ అందరినీ మెప్పిస్తుంది. ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా? అని కళింగ చూస్తే అనిపిస్తుంది. టెక్నికల్‌గా ఈ చిత్రం చాలా బ్రిల్లియంట్‌గా కనిపిస్తుంది. తెరపై చాలా రిచ్‌గా, అద్భుతంగా అనిపిస్తుంది.
ధృవ వాయ తన టెక్నికల్ టీంను వాడుకుని మంచి అవుట్ పుట్‌ను రాబట్టుకొన్నాడు. ఆ విషయంలో ధృవ వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఇలాంటి చిత్రాలకు టెక్నికల్ టీం ప్రధాన బలంగా నిలుస్తుంది. ఆర్ఆర్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఫారెస్ట్ విజువల్స్, భయపెట్టే సీన్లను కెమెరామెన్ ఎంతో సహజంగా, అందంగా తీశాడు. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ వర్క్ వల్లే ఈ సినిమా నిలబడుతుందని చెప్పొచ్చు.
సినిమా ఫస్ట్ పది నిమిషాలు అద్భుతంగా అనిపిస్తుంది. కథలోకి ఆడియెన్స్‌ను అలా లీనం చేసేస్తాడు దర్శకుడు. ఆ తరువాత ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ ప్రేక్షకుడిలో అలా పెరుగుతూనే ఉంటుంది. అసలేం జరుగుతోంది? పొలిమేర దాటిన వ్యక్తులేం అవుతున్నారు? ఎవరు చంపుతున్నారు.. ఎవరు అలా భక్షిస్తున్నారు? అనే పాయింట్లతో ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుంది.
సెకండాఫ్‌లో మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటే బాగుండేది. అయితే ఈ సెకండాఫ్‌కు ప్రధాన బలం.. చివరి 20 నిమిషాలు. వీఎఫ్ఎక్స్‌తో ఆకట్టుకుంటారు. వాటిని చూస్తే ఈ మధ్య వచ్చి కాంతార, విరూపాక్ష, హనుమాన్ చిత్రాలు కూడా గుర్తుకు వస్తాయి. కళింగకు నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. ఆడియెన్స్ ఈ మూవీని చూసిన తరువాత ఇది చిన్న సినిమా అంటే నమ్మరు. అంత రిచ్‌గా, గ్రాండియర్‌గా కనిపిస్తుంది.
రేటింగ్ 3.25/5