భారతీయన్స్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

మామూలుగా ఒకే తరహా సినిమాలు పదుల సంఖ్యలో విడుదల అవ్వడం అన్నది కామన్. కానీ కొన్ని సినిమాలు మాత్రమే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో దేశభక్తి చిత్రాలు కూడా ఒకటి. దేశభక్తిని చాటి చెప్పే చిత్రాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలా ఇప్పటివరకు తెలుగులో విడుదలైన సినిమాలను వేళ్ళలో లెక్కపెట్టవచ్చని చెప్పవచ్చు. దేశం కోసం ప్రాణాలు విడిచిన సంఘటనలు శత్రు దేశాల దాడులకు సంబంధించిన అనేక రకాల సంఘటనలను ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశభక్తితో కూడిన మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పేరు భారతీయన్స్. ధీన రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాను శంకర్ నాయుడు నిర్మించారు.

కథ
ఈ సినిమాలో కథ విషయానికి వస్తే.. ఇందులో పాత్రలకు పేర్లు ఉండవు. కేవలం ప్రాంతాల పేర్లతో మాత్రమే పిలుస్తూ ఉంటారు. అలా భోజ్ పురి, తెలుగు, నేపాలి, బెంగాలి, త్రిపుర, పంజాబీలు ఇలా ఆరుగురు ఒకే చోటకు చేరుతారు. వాళ్లందరికీ ట్రైనింగ్ ఇస్తారు. అయితే చివరకు వారిని ఇండియన్ బార్డర్ దాటి చైనాలోకి వెళ్లమని చెబుతారు. అక్కడి గెస్ట్ హౌస్‌లోని ల్యాబ్‌లో ఏం జరుగుతోంది? అక్కడి సీక్రెట్లు ఏంటి? అనేది తెలుసుకుని రావాలని చెబుతారు. కానీ అసలు ఆ ఆరుగురు ఒకే చోటకు ఎందుకు వచ్చారు? వారి నేపథ్యం ఏంటి? వారికి ట్రైనింగ్ ఇచ్చిన వారు ఎవరు? చైనా వేసిన ఎత్తు ఏంటి? ఇలాంటి విషయాలు అన్నీ తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.

నటీనటులు

ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. ఇందులో భోజ్ పురి, పంజాబీ, నేపాలి, త్రిపుర, తెలుగు, బెంగాలి ఇలా అందరూ చక్కగా నటించారు. పంజాబీ, త్రిపుర, బెంగాలి పాత్రల్లో చేసి అమ్మాయిలు తెరపై అందంగా కనిపించారు. ఎవరి పాత్రకు వారు పూర్తిగా న్యాయం చేశారు.

విశ్లేషణ

దేశభక్తి సినిమాలలో మామూలుగా ఉగ్రవాద కుట్రలు చైనా పాకిస్తాన్ ఇండియా వంటి బార్డర్లలో ఏం జరుగుతుంది లాంటి విషయాలను తెరకెక్కించడం అన్నది నిజంగా ఒక సాహసమే అని చెప్పవచ్చు. ఆ సాహసాన్ని నిర్మాత శంకర్, దర్శకుడు ధీన రాజ్ చేశారు. అలాగే ఈ దేశ భక్తి సినిమాను ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు.

ఇక ఫస్ట్ పార్ట్ లో పాత్రలో పరిచయం వారి నేపథ్యాలు చూపించారు. ఇక సెకండ్ పార్ట్ లో అసలు కథ ట్విస్టులు మొదలవుతాయి. అలా చివరికి క్లైమాక్స్ రసవత్తరంగా మారుతుంది. అంతే కాకుండా క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సిందే. సినిమా ముగింపు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని చాటి చెప్పే చిత్రమిది.

సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సిక్కిం ఏరియా, సరిహద్దు ప్రాంతాలను చక్కగా చూపించారు కెమెరామెన్. సంగీతం కూడా బాగుంది. ఆర్ఆర్‌తో కొన్ని సీన్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాత దర్శకుడు కష్టపడిన ఫలితాలు ప్రతిఫలం దక్కుతుందని చెప్పవచ్చు..

రేటింగ్: 3/5