సినిమా: సింబా
నటీనటులు: జగపతిబాబు, అనసూయ, శ్రీనాథ్ మాగంటి, కబీర్ సింగ్, కస్తూరీ, దివి తదితరులు
దర్శకత్వం: మురళీ మనోహర్రెడ్డి
నిర్మాత: సంపత్ నంది, రాజేందర్ సంయుక్త
విడుదల: ఆగష్టు 9, 2024
కథ:
హైదరాబాద్ లో ఓ దారుణ హత్య చోటు చేసుకుంటుంది. ఆ హత్యపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మరో హత్య జరుగుతుంది. అయితే ఆ వరుస హత్యల వెనక ఒక స్కూల్ టీచర్ (అనసూయ) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్ మాగంటి) ఉన్నట్టు పోలీసులు నిర్ధరణకి వస్తారు. వారిని అరెస్ట్ చేసి, జైలుకు పంపిస్తారు. అంతలోనే వాళ్లిద్దరినీ అంతం చేయడానికి రంగంలోకి దిగిన మరొకరు పోలీసుల ముందే హత్యకు గురవుతారు. ఈసారి స్కూల్ టీచర్, ఫాజిల్ కు బెంగళూరు నుంచి వచ్చిన ఇంకొకరు కూడా తోడై ఈ హత్యలో పాలు పంచుకుంటారు. విచారణలో మాత్రం అమాయకులమని.. ఈ హత్యలతో వారికీ ఎలాంటి సంబంధం లేదని హత్యకు గురైనవాళ్లంతా పారిశ్రామిక వేత్త పార్థ (కబీర్ సింగ్) సంబంధీకులే. అసలు పార్థకీ, హత్యలు చేస్తున్న ఈ సాధారణ వ్యక్తులకీ సంబంధమేంటి? పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చిన పురుషోత్తమ్ రెడ్డి (జగపతిబాబు ) ఎవరు? ఆయనకీ ఈ హత్యలకీ సంబంధమేమైనా ఉందా? అనేది తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన: అనసూయ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు ఈమె తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. ఒకవైపు స్కూల్ టీచర్ గా నటించి మరోవైపు యాక్షన్ సన్నివేశాలలో కూడా అదరగొట్టారని చెప్పాలి.వసిష్ఠ సింహ మాత్రం పోలీసాఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. శ్రీనాథ్ పర్వాలేదనిపించాడు. జగపతి బాబు పర్యావరణ ప్రేమికుడిగా కొత్తగా నటించారు. దివి, అనీష్ కురువిళ్ళ, కస్తూరి.. మిగిలిన నటీనటులు ఓకే అనిపిస్తాయి.
టెక్నికల్: కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి ఈ సింబా సినిమాని తెరకెక్కించాడు. ఈయనకు మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అనుకున్న కథను తెరపై ఎంతో అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకుల చూపు తిప్పకుండా చేశారు.టెక్నికల్ టీంను బాగానే వాడుకున్నాడు దర్శకుడు మురళీ. మంచి విజువల్స్, ఆర్ఆర్‌లతో తన సినిమాను బాగానే ప్రజెంట్ చేశాడు. కొత్త దర్శకుడైనా కూడా ఆ అనుభవరాహిత్యం మాత్రం ఎక్కడా కనిపించలేదు. తొలి ప్రయత్నంలోనే మురళీ తన మేకింగ్ నాలెడ్జ్‌ను చూపించాడు. ఆయన మేకింగ్, టేకింగ్‌కు అందరినీ మెప్పిస్తుంది. సినిమాకు ఏది అవసరము ఆ విషయాన్ని టెక్నికల్ టీం నుంచి రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. ఇక సంపత్ నంది మాటలు అద్భుతంగా ఉన్నాయి మొత్తానికి టెక్నికల్ పరంగా ఈ సినిమా కూడా అందరిని మెప్పించింది
విశ్లేషణ: ఈ సినిమా కథ చూస్తే ఒక రివేంజ్ స్టోరీ లాగే అనిపిస్తుంది.సెల్యులర్ మెమరీ, బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు మొక్కలు నాటాలి అని పర్యావరణానికి సంబంధించిన అంశాలను కూడా తీసుకువచ్చారు సినిమా మొదలైన కొద్దిసేపటికే కథలోకి వెళ్తారు ఇంటర్వెల్ వచ్చేటప్పటికి ఎందుకు ఈ ముగ్గురు ఇలా బిహేవ్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతోందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కొన్ని మరీ సిల్లీగా, లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడడం అనే కాన్సెప్ట్ బాగానే ఉంది.
రేటింగ్: 3/5