కెప్టెన్ గా నువ్వేం పీకావ్… ఆదిరెడ్డి పై ఫైర్ అయిన నాగార్జున?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారమవుతు ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకొని నాల్గవ వారం కూడా నేటితో పూర్తి కానుంది. ఇకపోతే మూడవ వారం హౌస్ కెప్టెన్ గా ఆదిరెడ్డి నిలిచిన విషయం మనకు తెలిసిందే.వారం రోజులపాటు ఎన్నో టాస్కులను నిర్వహిస్తూ కంటెస్టెంట్ల మధ్య పెద్ద ఎత్తున గొడవలు పెడుతుంటారు బిగ్ బాస్. అయితే శని ఆదివారాలలో నాగార్జున కంటెస్టెంట్లతో ముచ్చటిస్తూ ఎవరు ఎలాంటి తప్పు చేసారు అనే విషయంపై మాట్లాడుతూ వారికి బాగా క్లాసు తీసుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ వారం కూడా నాగార్జున పలువురు హౌస్ మెట్లకు బాగా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం హౌస్ మేట్లతో ముచ్చటించినటువంటి నాగార్జున బాలాదిత్య చాలా సీరియస్ గా ఉన్నారంటూ మాట్లాడగా.. గీతూ గురించి కూడా నాగార్జున మాట్లాడుతూ కాస్త ఫన్ క్రియేట్ చేశారు.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఆర్జే సూర్య భోజనం చేస్తూ ఉన్నఫలంగా తన భోజనం మొత్తం డస్ట్ బిన్ లో పడేశారు. ఈ విషయంపై నాగార్జున ఆర్ జె సూర్యకు బాగా క్లాస్ పీకారు.

ఇక మూడవ వారం హౌస్ కెప్టెన్ గా ఉన్నటువంటి ఆదిరెడ్డి పై కూడా నాగార్జున ఫైర్ అయ్యారు. ఆదిరెడ్డి ఫుడ్ విషయంలో తాను ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వను ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో చాలా తక్కువ ఫుడ్ ఉంది అన్నావు కదా అని అడిగారు. అందుకు ఆదిరెడ్డి అవునని సమాధానం చెప్పారు. మరి ఈ వారం కెప్టెన్గా నువ్వు ఏం పీకావ్ అంటూ నాగార్జున ఓరెంజ్ లో ఆది రెడ్డి పై ఫైర్ అయ్యారు. మొత్తానికి వారంలో ఎవరు ఎలాంటి తప్పులు చేశారో వారందరికీ బాగా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది.