రెండవ వారం డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు వీళ్లే.. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే!

టెలివిజన్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియల్ ఎపిసోడ్ కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ దేశంలో నెంబర్ వన్ షోగా నిలిచింది. ఇప్పటికే ఐదు సీజన్ లో పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇటీవల ఆరవ సీజన్ ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి వారం పూర్తిచేసుకుని రెండవ వారం కొనసాగుతోంది.

అయితే మొదటి వారంలో ఎలిమినేషన్ లేదని నాగార్జున అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక రెండవ వారం ప్రారంభమై రెండు రోజులు పూర్తి అయింది. ఈ క్రమంలో రెండవ వారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ వారంలో మొత్తం 6 మంది సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు .వీరిలో రేవంత్, అభినయశ్రీ, ఫైమా, ఆదిరెడ్డి, మెరీనా & రోహిత్, గీతూ రాయల్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నిర్వహిస్తున్న ఆదిత్యని బిగ్ బాస్ మరో ఇద్దరి కంటెస్టెంట్లను ఎలిమినేషన్ కి నామినేట్ చేయమని కోరాడు.

దీంతో రాజశేఖర్, షాని సాల్మన్ ని ఆదిత్య నామినేట్ చేశాడు. ప్రస్తుతం 8 మంది కంటెస్టెంట్లు రెండవ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో నామినేట్ అయ్యారు. అయితే వీరిలో ఒక కంటెస్టెంట్ మాత్రమే హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నాడు. ఇక ఈ వారం తక్కువ ఓటింగ్ సాధించిన వారు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నారు. ఈ క్రమంలో షానీ సాల్మన్, రాజశేఖర్‌ అతి తక్కువ ఓటింగ్ తో చివరి స్థానాల్లో నిలిచారు. అందువల్ల వీరిద్దరిలో ఒకరు కచ్చితంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం ముగిసేసరికి ఇంకా మూడు రోజులు గడువు ఉండటంతో వీరిద్దరి ఓటింగ్ లో తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.