బిగ్ బాస్ 8 వ వారం ఓటింగ్ లో తారు మారు… డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్…?

దేశవ్యాప్తంగా నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమావుతు ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల ఆరవ సీజన్ కూడా ప్రారంభం అయింది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు ఈ ఆరవ సీజన్లో పాల్గొన్నారు. ఈ ఆరవ సీజన్ ఇప్పటికే 7 వారాలు పూర్తి చేసుకోగా.. మొత్తం ఏడు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఇంట్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోరాడుతున్నారు. ఇక ఎప్పటిలాగే 8వ వారంలో కూడా ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది.

ప్రతి వారం లాగే ఈ వారం కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్ల మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. ఇక నామినేషన్ ప్రాసెస్ లో కూడా కంటెస్టెంట్లు ఒకరినొకరు బ్లేమ్ చేస్తూ తిట్టుకున్నారు. ముఖ్యంగా రేవంత్, గీతుచౌదరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక ఈ 8 వ వారంలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఈ ఆరవ సీజన్లో మొదటి వారం నుండి ఓటింగ్ విషయంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇక తాజాగా 8వ వారంలో కూడా ఓటింగ్ చాలా ఊహించని విధంగా జరిగింది. దీంతో ముందు వారం తో పోల్చితే ప్రస్తుతం కంటెస్టెంట్ల స్థానాలు తారుమారు అయ్యాయి.

ఇక ఈ ఎనిమిదవ వారంలో ఎప్పటిలాగే మొదటి రెండు స్థానాలు రేవంత్, శ్రీహాన్ కైవసం చేసుకున్నారు. ఇక మూడవ స్థానంలో గీతు రాయల్, నాలుగవ స్థానంలో ఆదిరెడ్డి, గతవారం డేంజర్ జోన్ లో ఉన్న
ఇనయా ఈ వారం ఐదో స్థానానికి చేరుకుంది. ఇక మునుపటివారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఉన్న బాలాదిత్య ఈవారం 8వ స్థానానికి పడిపోయాడు. ఇక మునుపటి వారంలో సాంగ్ కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ లో ఉన్న ఆర్జె సూర్య అతి తక్కువ ఓటింగ్ తో ఈవారం 14వ స్థానంలో నిలిచాడు. ఈవారం ఆర్ జె సూర్య తో పాటు రాజశేఖర్ కూడా 3 వ స్థానంలో నిలిచి డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఇంకా ఓటింగ్ ప్రాసెస్ లో మార్పులు జరిగే అవకాశం ఉండటంవల్ల వీరి స్థానాలు తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.