సుధీర్‌కు వింత గెటప్.. జతగా రష్మీ కూడా చేరిపోయింది!!

సుడిగాలి సుధీర్ అంటే అక్కడే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సుధీర్ కనిపించాడంటే చాలు ఫన్ ఉండాల్సిందే. ఢీ స్టేజ్ మీద, జబర్దస్త్ షోల్లోనూ సుధీర్ ఎలా హంగామా చేస్తాడో అందరికీ తెలిసిందే. పైగా సుధీర్‌ మీద అందరూ సెటైర్లు వేస్తూ.. పిచ్చొడిని చేస్తూ స్కిట్స్ వేస్తే ఎంతగా ఫన్ వస్తుందో అవి ఎంత క్లిక్ అవుతాయో అందరికీ తెలిసిందే. అందుకే స్కిట్స్‌లో దాదాపు సుధీర్ మీదే ఎక్కువగా పంచ్‌లు పడుతుంటాయి.

Sudigali Sudheer variety Get Up In Dhee

ముఖ్యంగా ఢీ సెట్‌లో సుధీర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రదీప్, రష్మీ, వర్షిణి, ఆది, శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి ఇలా ప్రతీ ఒక్కరూ సుధీర్ మీద కామెంట్లు సెటైర్లు వేస్తూనే ఉంటారు. అందరూ కలిసి సుధీర్‌ను ఆడుకుంటారు. తాజాగా సుధీర్‌కు ఓ వింత గెటప్ వేయించారు. అడవుల్లో నివసించే మనుషుల్లా గెటప్ వేశారు. జుట్టు, చెవులు, ముక్కుకు వెరైటీగా రింగులు పోగులు పెట్టారు.

ఇదంతా ఒకెత్తు అయితే వెనకాల వేసిన బ్యాక్ గ్రౌండ్ పాట, రష్మీ వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. రష్మీ సుధీర్ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు అందరూ పగలబడి నవ్వారు. మొత్తానికి ఢీ షోలో సుధీర్ ఉంటే ఆ సందడే వేరు అని అందరికీ తెలిసిందే. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్‌లో సుధీర్ రష్మీబాగానే హైలెట్ అయ్యేట్టు కనిపిస్తోంది. కంటెస్టెంట్ల డ్యాన్స్ పర్ఫామెన్స్, ప్రియమణి ఎమోషనల్ కామెంట్స్, సుధీర్ పర్ఫామెన్స్ అన్నీ కలిసి ఎపిసోడ్‌పై బాగానే హైప్ పెంచేస్తోంది.

https://www.youtube.com/watch?v=AzyypRgxKs4