జబర్దస్త్ నుండి తప్పుకున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు నష్టపోయింది ఎవరు…?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దాదాపు 9 సంవత్సరాల కు పైగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా గుర్తింపు పొంది ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కుకున్నారు. ఇలా ఈ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుధీర్ కి ఒక హీరోకి ఉన్న రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. ఇలాజబర్దస్త్ పుణ్యమా అని బుల్లితెర మీద తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న కొంతకాలం క్రితం తనకి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ వదిలి బయటకి వెళ్ళిపోయాడు.

అయితే సుధీర్ జబర్దస్త్ కి దూరం కావటంతో.. జబర్దస్త్ చూసేవారు లేక ఆ షో రేటింగ్స్ పడిపోయి.. షో ఎత్తేసే పరిస్థితి ఏర్పడుతుందని వార్తలు ప్రచారం అయ్యాయి. దీంతో జబర్దస్త్ అభిమానులందరూ సుధీర్ మళ్లీ వెనక్కి తిరిగి రావాలని కోరుకున్నారు. కానీ సుధీర్ జబర్దస్త్ కి దూరమైనా కూడా జబర్దస్త్ షో మాత్రం ఎప్పటిలాగే నిర్విఘ్నంగా ప్రసారమవుతూనే ఉంది. జబర్దస్త్ కి వచ్చే రేటింగ్స్ వస్తూనే ఉన్నాయి. అయితే జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిన సుధీర్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మాటీవీలో షోస్ లేకపోవటంతో కొంతకాలంగా సుధీర్ ఖాళీగా ఉంటున్నాడు. అంతేకాకుండా సుధీర్ నటించిన సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ లభించకపోవడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గినట్టు తెలుస్తుంది. ఇలా సినిమాలు లేక టీవీ షోలో లేక చాలా కాలంగా సుధీర్ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మల్లెమాల వారి అగ్రిమెంట్ ప్రకారం సుధీర్ మళ్లీ ఈటీవీలో కనిపించే అవకాశం కూడా లేదు. ఇక ప్రస్తుతం ఆహాలో ప్రసారం కానున్న ఒక కామెడీ షోలో సుధీర్ సందడి చేయనున్నాడు. నెలకి దాదాపు 20 రోజులపాటు షూటింగ్ లతో బిజీగా ఉండే సుధీర్ ప్రస్తుతం కనీసం ఒక వారం కూడా షూటింగ్ లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. సుధీర్ జబర్దస్త్ నుండి బయటకు రావడం వల్ల జబర్దస్త్ కన్నా సుధీర్ భారీగా నష్టపోయినట్లు అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.