తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ యాసలో గడగడ మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు యాంకర్ శివజ్యోతి. అచ్చం తెలంగాణ ఆడబిడ్డల కట్టుబొట్టుతో పాటు తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంతో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయిన శివ జ్యోతి ఈ కార్యక్రమం అనంతరం సోషల్ మీడియాలోనూ అలాగే బుల్లితెర కార్యక్రమాలలోను పాల్గొంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే సోషల్ మీడియా పుణ్యమా అని తెలియని వారికి కూడా శివ జ్యోతి అంటే తెలియడమే కాకుండా ఈమె సెలబ్రెటీగా మారిపోయారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసే ఈమె తాజాగా తన సొంతూరికి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన సొంత ఊరిలో మామిడి తోటలో తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఫుల్ దావత్ చేసుకున్నట్టు శివ జ్యోతి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే తాను భోజనం చేస్తున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ మా ఊరి మామిడి తోటలో మటన్ కూర, ముక్క గుడాలు, ఈత కల్లు అంటూ రైమింగ్ తో కూడిన పదాలను క్యాప్షన్ జోడించారు ఈ క్రమంలోనే ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన ఎంతోమంది అభిమానులు నీ మొహం చూస్తేనే తెలుస్తోంది ఫుల్లుగా కల్లు తాగావని అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాకు లేదా జ్యోతక్క దావత్ అంటూ కామెంట్ చేస్తున్నారు.