రిషి సార్ నాకు కాబోయే భర్త… తండ్రికి ఎదురు తిరిగిన వసుధారా…. దేవయాని రాజీవ్ ప్లాన్ ఫలిస్తుందా?

బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. దేవయాని రాజీవ్ కిఫోన్ చేసి చెప్పిన ప్లాన్ ఎంతవరకు వచ్చింది అనడంతో ఇప్పుడే ఆ ప్రేమ పక్షులు ఇద్దరు కారులో షికారు చేస్తే నా కంటపడ్డారు. మీరేం భయపడకండి ఆ ప్రేమ పక్షులను విడదీసి వసుధార మెడలో నేను తాళి కడతాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు.మరోవైపు జగతి మహీంద్రా ఆలోచిస్తూ కూర్చుండగా ధరణి వాళ్లకు కాఫీ తీసుకువస్తుంది. అది చూసిన దేవయానికి మీరు అనుకున్నది ఏది జరగనివ్వను అనుకుంటుంది.

మరోవైపు చక్రపాణి అలాగే అక్కడే కూర్చోగా సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. ఇలాంటి కూతుర్ని ఎందుకు కన్నానా అని ఏడుస్తున్నావా లేక ఇలాంటి మొగుడిని ఎందుకు కట్టుకున్నానని ఏడుస్తున్నావా? ఎవరో సార్ అంటా వాడు రాగానే ఇది పరుగులు పెట్టి వెళ్ళింది రాని దాని సంగతి చెబుతా అంటూ ఆవేశపడతాడు. రిషి వసుధారను తన ఇంటి దగ్గర దింపేస్తాడు. వసుధార ఏం జరిగినా నేనున్నానని మర్చిపోకు మన ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మాత్రమే దూరం అని అనుకుంటున్నాను అని చెప్పడంతో నేను కూడా ఆ అపురూపమైన క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను సార్ అని చెప్పి లోపలికి వెళుతుంది.

లోపలికి వస్తున్న వసుధారని చూసి చక్రపాణి అక్కడే ఆగు. ఎవడు వాడు సార్ వస్తేనే అలా వెళ్ళిపోయావు అంటూ చక్రపాణి రిషి గురించి చెడుగా మాట్లాడటంతో వసుధార నాన్నా మర్యాదగా మాట్లాడండి రిషి సార్ గురించి ఇలా మాట్లాడితే నేను ఒప్పుకోను. అంతేకాకుండా రిషి సార్ నాకు కాబోయే భర్త నేను తనని పెళ్లి చేసుకునేది తననే అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు.నాకే ఎదురు తిరిగి పెళ్లి చేసుకుంటావా అంటే నేను నీకు చెడ్డ కూతురిని కావచ్చు కానీ నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. రిషి సార్ వాళ్ళది గొప్ప ఫ్యామిలీ సార్ వజ్రం లాంటివాడు .వాళ్ల ఫ్యామిలీలో కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అని వసుధార చెప్పడంతో అంత వాళ్ళిష్టమైన నేను ఒప్పుకోవాలి కదా అనడంతో నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరుగుతుంది అంటూ వసుధార తన తండ్రికి ఎదురు తిరుగుతుంది.

నువ్వు ఫోన్ పగలగొట్టావ్ సార్ నాకు ఫోన్ ఇచ్చారు. మనసులు విడదీయడం గొప్పకాదు కలపడం గొప్ప అంటూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. అలాగే రిషి కూడా అదే ఊర్లో తిరుగుతూ ప్రకృతి ఆస్వాదిస్తూ ఇది వసుధార తిరిగిన నేల అంటూ ఆనందపడుతూ గట్టిగా ఐ లవ్ యు వసుధార అంటూ అరుస్తాడు. ఇక గదిలో వసుధార ఫోన్ ఆన్ చేస్తూ ఉండగా అంతలోపు తన తల్లి అక్కడికి వెళుతుంది. రిషి ఫోటో చూపించి తనే రిషి అంటే చాలా బాగున్నాడు ఎలాంటి భర్త దొరుకుతాడు అని బాధపడ్డాను అంతా మంచే జరుగుతుంది అని సుమిత్ర మాట్లాడుతుంది. నాన్నను ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పించమ్మా నాన్న ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకునేది రిషి సార్ నే తానే నా జీవితం అంటూ వసుధారా మాట్లాడుతూ తన తల్లి మీ నాన్నకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

మరోవైపు దేవయానికి రిషి ఫోన్ చేసి పెద్దమ్మ ఎక్కడున్నారు అనడంతో హాల్లో ఉన్నానని చెబుతుంది ఒకసారి అందరిని పిలవండి పెద్దమ్మ అనడంతో ధరణి వెళ్లి రిషి ఫోన్ చేశారు అందరూ రండి అని చెప్పగా అందరూ హాల్ లోకి వస్తారు.అప్పుడు దేవయాని స్పీకర్ ఆన్ చేయగా అందరూ వినండి ఏ క్షణమైన వసుధార మనకు ఫోన్ చేయవచ్చు మీరందరూ కూడా బయలుదేరండి అని చెప్పడంతో సంతోషపడతారు అయితే తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.