రాకేష్ తమ్ముడి కూతురి బర్త్ డే పార్టీ లో సందడి చేసిన వర్ష.. వైరల్ అవుతున్న ఫోటోలు!

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఫేమస్ అయిన రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోలో టీం లీడర్ గా తన కామెడీతో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా పండుగ సందర్భాలలో ఈటీవీలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో కూడా తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇంతకాలం చిన్న పిల్లలతో స్కిట్లు చేస్తూ అలరించిన రాకేష్ ఇప్పుడు సుజాతతో కలిసి స్కిట్లు చేస్తూ సందడి చేస్తున్నాడు. జబర్దస్త్ టీం లీడర్ గా కన్నా సుజాతతో ప్రేమాయణం మొదలైన తర్వాతనే రాకేష్ బాగా ఫేమస్ అయ్యాడు. అందరిలాగే వీరిద్దరూ కూడా కేవలం జబర్దస్త్ రేటింగ్స్ కోసం మాత్రమే ప్రేమించుకుంటున్నారని భావించారు.

కానీ వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లబోతోంది. ఇరు కుటుంబాలలో వీరు పెళ్లికి అంగీకరించడంతో తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కపోతున్నారు. ఇక రాకేష్ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఆ ఇంటికి కాబోయే కోడలిగా సుజాత తెగ సందడి చేస్తోంది. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా రాకేష్ ఇంట్లో నిర్వహించిన లక్ష్మీ పూజలో పాల్గొని సందడి చేసింది. ఇక తాజాగా రాకేష్ తమ్ముడి కూతురి మొదటి బర్తడే పార్టీలో కూడా సుజాత సందడి చేసింది. ఈ బర్తడే పార్టీని రాకేష్ తన ఇంట్లో చాలా ఘనంగా నిర్వహించాడు. ఈ బర్తడే పార్టీకి బంధుమిత్రులతోపాటు సినిమా, సీరియల్ సెలబ్రిటీలకు కూడా హాజరై సందడి చేశారు.

ఈ బర్తడే వేడుకల్లో పలువురు జబర్దస్త్ కమెడియన్లతో పాటు నటీనటులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా సుజాత రాకేష్ ఇద్దరు కలిసి పెళ్లికి ముందే చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ సందడి చేస్తున్నారు. అంతే కాకుండా పెళ్లి కాకుండా వీరిద్దరూ ఒకే ఇంట్లో కలసి ఉంటూ సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.