అందరూ అలాంటి మాటలే అంటున్నారు.. కన్నీరుమున్నీరైన ప్రియమణి

ఢీ షోలో ప్రియమణి చేసే రచ్చ ఇచ్చే జడ్జ్మెంట్ అందరికీ తెలిసిందే. ప్రియమణి టీం లీడర్లతో, శేఖర్ మాస్టర్‌తో కలిసి చేసే డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ షోలో పోటీ వేడెక్కింది. క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చేసింది. పర్ఫామెన్స్‌లు అదే స్థాయిలో ఉంటున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అయితే ప్రతీ ఒక్కరూ దూసుకుపోయినట్టే కనిపిస్తోంది.

Priyamani Emotional On Dhee stage

అందులో ఓ కంటెస్టెంట్ మగువా మగువా అనే పాటకు డ్యాన్స్ చేశాడు. మహిళల గొప్పదనం చాటేలా చేసిన ఆ డ్యాన్స్ పర్ఫామెన్స్‌ను చూసిన వారంతా ఎమోషనల్ అయ్యారు. అందరూ కూడా కన్నీరుపెట్టుకున్నారు. రష్మీ, వర్షిణి, పూర్ణ, ప్రియమణి ఇలా ప్రతీ ఒక్కరూ ఏడ్చేశారు. ఇక ప్రియమణి మాట్లాడిన మాటలు, చెప్పిన ఘటనలు మరింత ఎమోషనల్ చేసేశాయి. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రియమణి మాట్లాడింది.

ఈ మధ్య మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని కొందరు చర్చలు పెట్టారు. అందులో చాలా మంది అమ్మాయిలు బయటకు ఎందుకు రావడం ఎందుకు పని చేయడం.. ఎందుకు పొట్టి బట్టలు వేసుకోవడం అంటూ మాట్లాడారు. అందరూ అలాంటి మాటలే మాట్లాడుతున్నారంటూ ప్రియమణి కన్నీరుమున్నీరైంది. ప్రియమణి చెప్పిన మాటలకు అందరి మనసులు చలించిపోయాయి.