షూటింగ్ గ్యాప్‌లో అలా చేస్తుందట.. రష్మీ పరువుదీసిన పూర్ణ

ఢీ షోలో జడ్జ్‌గా వచ్చే పూర్ణ ఎంతలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో అందరికీ తెలిసిందే. డ్యాన్సులు చేయడంలోనూ, స్కిట్స్‌లో నటించడంలోనూ, సెటైర్లు వేయడంలోనూ పూర్ణ తన ప్రత్యేకతను చాటుకుంది. ఇక వెండితెరపై నటిగా నిరూపించుకున్న పూర్ణకు ఒకరిని ఇమిటేట్ చేయడం, ఒకరిలా నటించడం పెద్ద విషయమేమీ కాదు. గతంలోని ఓ ఎపిసోడ్‌లో శేఖర్ మాస్టర్, బాబా మాస్టర్, ప్రియమణి, యానీ మాస్టర్‌లా నటించిన పూర్ణ మరోసారి దుమ్మలేపింది.

Anchor Pradeep, Poorna, Dhee, Sudigali Sudheer

ఢీ షోకు సంబంధించిన తాజా ప్రోమోలో పూర్ణ రెచ్చిపోయింది. హైపర్ ఆది, రష్మీ, సుధీర్, వర్షిణిలా నటించి వారి పరువుదీసింది. హైపర్ ఆదిలా నటించిన పూర్ణ మొత్తం పరువుదీసింది. మరీ ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లు డ్యాన్స్ చేస్తే ఎలా తీక్షణంగా చూస్తాడు.. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడో చేసి చూపించింది.ఇక రష్మీ గురించి చెబుతూ.. ఆమె ఎలా నడుస్తుంది.. ఎలా ఎంట్రీ ఇస్తుంది.. సెట్‌లో ఎలా ఉంటుందనేది చేసి చూపించింది.

గున్న గున్న మామిడి పాటకు రష్మీ ఎలా స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇస్తుందో చేసి చూపించింది. ఇక షూటింగ్ జరుగుతున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఎలా కూర్చుంటుందో చేసి చూపించింది. లంచ్ టైం అనగానే ఎలా తింటుందో చేసి చూపించడంతో అందరూ నవ్వేశారు. అంత అంత ముద్దలు పెట్టుకుని కుంభకర్ణుడిలా తింటుందని చూపించింది. ఇక షూటింగ్ స్టార్ట్ అయినా కూడా అలాగే తింటూ నోట్లోనూ ఉంచుకుంటుందని చూపించి రష్మీ పరువును తీసేసింది.