రివ్యూ  : ఒకే ఒక జీవితం 

oke oka jeevitham movie review

 

నటినటులు: శర్వానంద్, రీతూ వర్మ, అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ఆలీ, మధు నందన్ తదితరులు.

డైరెక్టర్: శ్రీ కార్తీక్

నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు

మ్యూజిక్ డైరెక్టర్: జెక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్

 

హీరో శర్వానంద్ – అక్కినేని అమల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే  ఒక జీవితం’.  నేడు రిలీజైన ఈ సైంటిఫిక్ థ్రిల్లర్   ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూ చూద్దాం.

 

కథ :

ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), మరియు చైతు (ప్రియదర్శి) చిన్న తనం నుంచే గొప్ప స్నేహితులు. ఏ పని చేసినా కలిసే చేస్తారు. ఏ పనిలోనూ కలిసే ఉంటారు. అయితే, ఈ ముగ్గురు తమ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ఈ జీవితంలో వారి ప్రస్తుత జీవితం వారికి నచ్చదు. అందుకే గతంలోకి వెళ్లి తమ వర్తమానాన్ని, భవిష్యత్తును మార్చుకోవాలని కోరుకుంటారు. అసలు వీళ్లకు గతంలోకి వెళ్ళే ఛాన్స్ ఎలా వచ్చింది ?, గతంలోకి వెళ్లి ఆది నిజంగానే తాను కోరుకున్నట్లు చనిపోయిన తన తల్లి (అమల)ని బతికించుకున్నాడా ? అసలు ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటీ ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

 

ఈ లోకంలో ఈ జీవితంలో.. మనలో ఎవరికైనా  ఒకే ఒక‌ జీవితం మాత్రమే ఉంటుంది. ఆ జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తాం, అలాగే ఎన్నో పోగొట్టుకుంటాం. మరి లైఫ్ లో మనకు రెండో ఛాన్స్ వస్తే.. ?,  మొత్తానికి గ‌తంలో చేసిన త‌ప్పుల్ని స‌వ‌రించుకునే ఆలోచన మీదే ఈ సినిమా సాగింది. ఇది నిజంగా మంచి ఆలోచనే. ఇలాంటి టైం మిషన్ కథలకు ఈ పాయింట్ మంచి సరుకే. అందుకే.. ఈ సినిమాకి ఈ పాయింటే పెద్ద ప్లస్ అయింది.

 

ఇక ఈ సినిమా ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పుకుంటే.. వైవిధ్యంగా సాగిన ఇదొక ఎమోషనల్ డ్రామా. గతం తాలూకు బాధలను, ప్రేమను, కాలం చేసే గాయాలను కరెక్ట్ గా చూపించిన సినిమా ఇది. హీరో శర్వానంద్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. మెయిన్ గా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మరియు క్లైమాక్స్ లో శర్వా నటన చాల బాగుంది. అలాగే తల్లి పాత్రలో నటించిన అక్కినేని అమల కూడా చాలా బాగా నటించింది.

 

అలాగే ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌  తమ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. నాజర్ కూడా తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఏది ఏమైనా ఇలాంటి కథతో కూడా సినిమా చెయ్యొచ్చు అని నమ్మి ఈ చిత్రాన్ని తీసిన శ్రీ కార్తీక్ ను అభినందించాలి. ఈ కమర్షియల్ లోకంలో ఇలాంటి పాయింట్ మీద ప్రేమను పెంచుకున్న అతని విజన్ కి హ్యాట్సాఫ్.

oke oka jeevitham movie review
oke oka jeevitham movie review

ప్లస్ పాయింట్స్:

శర్వానంద్ – అక్కినేని అమల నటన,

దర్శకుడు శ్రీ కార్తీక్ స్క్రిప్ట్ అండ్ టేకింగ్,

కథ కథనం

సినిమాటోగ్రఫీ

ఇంటర్వెల్ బ్యాంగ్

ఎమోషన్స్,

 

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ లో స్లో నేరేషన్

కొన్ని చోట్ల మెలో డ్రామా

 

తీర్పు : 
 

ఈ ‘ఒకే ఒక జీవితం’ సినిమా చాలా బాగుంది. జీవితంలో సెకండ్ ఛాన్స్ వస్తోందో రాదో తెలియదు గానీ, ఈ సినిమా మిస్ అయితే, మళ్లీ ఇలాంటి సినిమా అయితే ఇప్పట్లో రాదు. అలా అని ఈ సినిమా పై మరీ అంచనాలు పెట్టుకోకండి. టైమ్ పాస్ కోసం హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు.

 

రేటింగ్ : 3 /5