బిగ్ బాస్ షో నాల్గో సీజన్ అనేది ఎలా ఉంది.. అందులో ఎలాంటి కంటెస్టెంట్లను పట్టుకొచ్చారు.. ఇప్పుడు ఎలా నడుస్తోందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏమీ లేకపోయినా సరే ఏదో ఉందని అనిపించేలా, ఎంతో హిట్ అయిందని చెప్పేలా ప్రతీవారం స్టేజ్ మీద నాగార్జున రికార్డుల గురించి గొప్పగా చెబుతుంటాడు. జీఈసీ అంటాడు.. టీఆర్పీ అంటాడు.. నోటికి ఇష్టమొచ్చిన సంఖ్య చెబుతూ కోట్లల్లో ఓట్లు పడ్డాయని చెబుతుంటాడు. కానీ ఈ మాటలను నెటిజన్లు ఎవ్వరూ నమ్మడం లేదు.
కానీ తాజాగా స్టార్ మా మాత్రం వీటిపై అధికారిక ప్రకటనచేసింది. నాగార్జున మీడియాతో మాట్లాడుతూ బిగ్ బాస్ నాల్గో సీజన్ రికార్డుల గురించి ఆసక్తికరమైనకామెంట్ చేశాడు. బిగ్‌బాస్ సీజన్ 4 గత రికార్డులను తుడిచిపెట్టేసిందని డప్పు కొట్టుకున్నారు. మరీ ముఖ్యంగా జాతీయస్థాయిలో బిగ్‌బాస్ 3 సీజన్ సృష్టించిన రికార్డులనూ ఇది అధిగమించిందని మరీ గొప్పలు చెప్పుకున్నాడు. అంతే కాకుండా గతవారం లెక్కలను కూడా బయటకు తీశాడు.
20+ టీవీఆర్‌తో ఇది బిగ్‌బాస్ షోలలో అతిపెద్ద ఆవిష్కరణగా నిలిచిందని. గతవారం ఏపీ మరియు తెలంగాణాలలో 4 కోట్లకు పైగా వీక్షకులు దీనిని వీక్షించడం ఈ షో పట్ల వారి ప్రేమకు నిదర్శనమని మరో గఫ్పాలు పలికాడు. గత 12 వారాలలో జంట రాష్ట్రాలలో దాదాపు 83% మంది వీక్షకులు బిగ్‌బాస్ సీజన్ 4 వీక్షించారని, అది అపూర్వమని షోను ఆకాశానికెత్తేశారు. అయితే వీటిలో ఎంత నిజమున్నదని ఎవ్వరూ ప్రశ్నించరనే ధీమాతో ఇలా చెబుతున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.