ఆ హీరో నాకు అంకుల్.. ఆ హీరో డార్లింగ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన జయసుధ!

సహజనటి జయసుధ ఇండస్ట్రీలో కొచ్చే ఐదు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈమె ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలం నుంచి చిరంజీవి వరకు పలు సినిమాలలో నటించి తన సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తూ అమ్మగా అమ్మమ్మ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సీనియర్ నటీమణులు జయసుధ, ఆమని, సంఘవి, కుష్బూ వంటి హీరోయిన్స్ సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన జయసుధకు సుమ క్యాష్ కార్యక్రమంలో భాగంగా జయసుధ 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తనని ఎంతో ఘనంగా సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో సుమ ఎప్పటిలాగే వీరితో పలు టాస్కులు చేయించి సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా జయసుధ తన కెరియర్ గురించి అలాగే పర్సనల్ విషయాల గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఈమె హీరోలతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈమె కృష్ణ గురించి మాట్లాడుతూ ఆయన తన అంకుల్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కృష్ణ గారితో కలిసి తాను ఎక్కువ సినిమాలు చేయలేదని ఈమె తెలిపారు.ఇక శోభన్ బాబు గురించి మాట్లాడుతూ ఆ హీరో తన డార్లింగ్ అంటూ ఈమె తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ హీరోల గురించి జయసుధ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.వెండితెరపై జయసుధ శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరి జోడి తెరపై ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తుంది ఈ క్రమంలోనే జయసుధ శోభన్ బాబుని డార్లింగ్ అంటూ చెప్పడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.