అమ్మ బాబోయ్.. జానీ మాస్టర్‌లో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా?

జానీ మాస్టర్ అంటే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లొ అందరికీ తెలిసిందే. ఇక రౌడీ బేబీ సాంగ్‌కి కూడా కొంత కొరియోగ్రఫీ చేసి నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేశాడు. కానీ క్రెడిట్ మొత్తం ప్రభుదేవా ఖాతాలోనే పడింది. అలా కాస్త బాధలో ఉన్న జానీ మాస్టర్‌కు బుట్టబొమ్మ రూపంలో అదృష్టంద దక్కింది. ఈ సినిమా ఎంత హిట్టైందో.. బుట్టబొమ్మ పాట అంతకంటే పెద్ద హిట్ అయింది. ఆ పాట అంతగా హిట్ కావడానికి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వేసిన స్టైలీష్ స్టెప్పులే. అవి వేయించింది జానీ మాస్టర్.

Jani Master Sings A SOng in Saregamapa Next Singing Icon
Jani Master Sings A SOng in Saregamapa Next Singing Icon

జానీ మాస్టర్ స్టెప్పులు ఏకంగా ఖండాలే దాటి పోయాయి. ఇండియా మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. అలా జానీ మాస్టర్ పేరు ఆ మధ్య వార్తల్లో హల్చల్ చేసింది. జానీ మాస్టర్‌కు బుల్లితెర కూడా బాగా అలవాటే. జబర్దస్త్, ఢీ, అదిరింది, పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలో జానీ మాస్టర్ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై జానీ మాస్టర్ అందించే ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్‌లో ఉంటుంది.

Jani Master Sings A SOng in Saregamapa Next Singing Icon
Jani Master Sings A SOng in Saregamapa Next Singing Icon

అయితే ఇన్నాళ్లూ జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు వేయగలడు.. ఎదుటి వాళ్లను నవ్వించే సెటైర్లు వేయగలడని మాత్రమే అనుకున్నారు. కానీ జానీ మాస్టర్ గొంతులో స్వరాలు కూడా అద్భుతంగా పలుకుతాయని తాజాగా తెలిసింది. జీ తెలుగులో ఈ మధ్యే నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ అని కోటి, ఎస్పీ శైలజ, చంద్రబోస్ సారథ్యంలో ఓ షో ప్రారంభమైంది. ఈ షోలో జానీ మాస్టర్ తన గొంతును విప్పాడు. సాగర సంగమంలోని తకిట తథిమి తందానా అనే పాటను అద్భుతంగా పాడటంతో అందరూ ఫిదా అయ్యారు.

https://www.youtube.com/watch?v=irXwCi3ILdQ