క్రేజీ ఆఫర్స్ వచ్చిన రాఘవ జబర్దస్త్ వదిలి వెళ్ళక పోవడానికి కారణం అదేనా?

జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందిని పరిచయం చేసింది. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయినవారు సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమై ఈ కార్యక్రమం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల క్రితం ప్రారంభమై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అయితే జబర్దస్త్ కు ఎంతోమంది కొత్త వాళ్ళు రావడం పాత వాళ్ళు వెళ్లిపోవడం జరుగుతుంది.

అయితే ఈ కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు రాకెట్ రాఘవ జబర్దస్త్ నుంచి తప్పుకోలేదు. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో చానల్లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మల్లెమాల వారి ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ రాకెట్ రాఘవ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టలేదు. అయితే ఈయన ఇతర చానళ్లకు వెళ్లకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.

ఈయనకు డబ్బులకన్నా మల్లెమాల వారితో ఉన్న అనుబంధం చాలా గొప్పదని అందుకే ఇతర కార్యక్రమాలకు వెళ్లలేదని తెలుస్తోంది. అయితే జబర్దస్త్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భారీ ఈవెంట్ నిర్వహించడానికి మల్లెమాలవారు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాకెట్ రాఘవకు ప్రత్యేకంగా ఏదైనా పురస్కారం అందించే అవకాశం కూడా లేకపోలేదని మరికొందరు భావిస్తున్నారు.జబర్దస్త్ ద్వారా తనకు ఎంతో పేరు ప్రఖ్యా తినవచ్చాయని అందుకే తాను ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళనని రాఘవ తెగేసి చెప్పారు.ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఈయన కొనసాగడమే కాకుండా తన కుమారుడు మురారి కూడా ఇప్పటికే జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.