బుల్లితెర మీద ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో. గత కొన్ని సంవత్సరాలుగా అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ప్రసారమైన ఐదు బిగ్ బాస్ సీజన్ లు కూడా మంచి రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. అలాగే ఓటీటీ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు సీజన్ కూడా మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్లలో పాల్గొని కంటెస్టెంట్లకు వారి పాపులారిటీని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇక బిగ్ బాస్ లో హోస్ట్ గా వ్యవహరించే నాగార్జునకి కూడా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఉన్నట్లు సమాచారం.
బిగ్ బాస్ ప్రారంభమైన మొదటి సీజన్ లో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రెండవ సీజన్ లో నాగార్జున స్థానంలో హీరో నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ప్రసారమైన మూడు, నాలుగు, ఐదు సీజన్లలో నాగార్జున హోస్టింగ్ చేశాడు. అంతే కాకుండా ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ఎందుకంటె బిగ్ బాస్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు నాగార్జున. బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ లో ఎన్ని పొరపాట్లు చేసినా కూడా నాగార్జున కొప్పడకుండ వాటిని చాలా సున్నితంగా సరిదిద్దడమే కాకుండా హౌజ్ మెంబర్స్ తో చాలా సరదాగా కలిసిపోతారు. అందువల్ల బిగ్ బాస్ షో కి నాగర్జున తప్ప వేరొకరు హోస్టింగ్ చేస్తే ప్రేక్షకులు అసలు అంగీకరించరు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కోసం నాగార్జున తీసుకునె రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. ఈ సీజన్ 6 కోసం నాగార్జున సినిమాలు కన్నా అధికంగా ఇమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సీజన్ 6 లో ఒక ఎపిసోడ్ కోసం నాగార్జున దాదాపు రూ.55 లక్షల వరకు రెమ్యూనరేషన్ అండుకొనున్నాడని సమాచారం. దీంతో మొత్తం 15 వారాల తో పాటు గ్రాండ్ ఫినాలే కలిపి నాగార్జునకు దాదాపు రూ.16.50 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.